కేసీఆర్ కారుకూతలు

ఇటీవల సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాల గురించి కేసీఆర్ మీడియాతో అన్న మాటలు.

“ఈ ఉద్యమాలన్నీ స్పాన్సర్డ్ ఉద్యమాలు. వీటిని డబ్బులిచ్చి చేయిస్తున్నారు. సెల్ టవర్ ఎక్కితే పదివేలు. కిరోసిన్ ఒంటి మీద పోసుకుంటే పదిహేను వేలు. బస్సు అద్దాలు పగల గొడితే ఇరవై వేలు..” ఇలా ఒక జాబితా వెనకేసుకొచ్చాడు.

కేసీఆర్? తెలంగాణా ఉద్యమ కారులకు నువ్వు ఇదే రేట్లు చెల్లించావా?

ఉద్యమం ప్రజల సొత్తు. కడుపు మండితే, గుండె రగిలితే ఉద్యమాలు చేస్తారు. నీ లాంటి నీచ రాజకీయ నాయకుల పైసలకాశపడి ఎవరూ ఉద్యమాలు చేయరు.   ఉద్యమ కారుల్ని అవమాన పరచద్దు. తెలంగాణా కోసం నిజమైన  ఉద్యమం చేసిన ఎవరైనా కేసీఆర్ పైన చెప్పిన మాటలు సమర్థిస్తే అది ఆత్మ వంచన మాత్రమే.

5 thoughts on “కేసీఆర్ కారుకూతలు

  1. అదేమి ప్రశ్న, అంత క్లియర్ గా చెప్పాక కూడా అర్ధం చేసుకోకపోతే ఎలా. చెల్లించకపోతే ఆ రేట్లన్నీ ఎలా తెలుస్తాయి.

వ్యాఖ్యలను మూసివేసారు.