ఇది మీకు భావ్యమా?

తెలంగాణా విషయమై కొద్ది సేపటి క్రితం కేంద్ర హోం మత్రి చిదంబరం చేసిన ప్రకటన అందరూ స్వాగతించాల్సింది. కేసీయార్ నిరాహార దీక్ష దరిమిలా కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ నెల తొమ్మిదో తేదీన తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి ప్రక్రియ మొదలుపెడతాం అనే ప్రకటన వినగానే స్వంత పార్టీలోనే కాక అన్ని ప్రధాన పార్టీల్లోనూ అసంతృప్తి బయటపడిన మాట మనకందరకూ తెలిసిన విషయమే. ఈనెల ఏడవతేదీన జరిగిన రాష్ట్ర అఖిల పక్ష సమావేశంలో స్వార్థ రాజకీయాలకోసం అన్ని పార్టీలు వివిధ ప్రాంతాలకు చెందిన కార్యకర్తల అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకోకుండా మీరు తీర్మానం ప్రవేశ పెడితే మేం  మద్ధతిస్తాం అనేశాయి.

అందరి అభిప్రాయాలూ పరిగణన లోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ రాష్ట్ర వ్యాప్తంగా అఖిల పక్ష నాయకులు గగ్గోలు పెట్టిన తతంగం రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా వీక్షించారు. అలాంటిది ఇప్పుడు అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ముందుకు వెళతామని కేంద్రం ప్రకటిస్తే కొద్ది మంది నాయకులకు ఎందుకు రుచించడం లేదు? అసలు చర్చలంటే వీళ్ళకి భయమెందుకు?

ఓ పక్క కేసీఆర్ లాంటి నాయకులు కూడా తెలంగాణా ప్రజలు వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేయొద్దనీ, సమస్యను రాజకీయంగా ఎదుర్కొంటామని ప్రకటిస్తుంటే, కాంగ్రెస్ తెలంగాణా విషయంలో మోసం చేసిందనడం నాగం జనార్ధన్ రెడ్డి లాంటి నాయకులకు ఎంతవరకు సబబు? ఇంకా ఎంతమంది అమాయకులను బలి చేస్తారు? అసలు వీళ్ళది నాలుకా? తాడిమట్టా? ఓ పక్క రాష్ట్రమంతటా అశాంతితో రగిలిపోతుంటే శాంతిని నెలకొల్పాలని కేంద్ర చేసిన ప్రకటనను అర్థం చేసుకుని ప్రజల్లో ఉన్న అనుమానాల్ని పోగొట్టాల్సింది పోయి ఇలా ప్రజలను రెచ్చగొట్టడం భావ్యమా?

ప్రకటనలు

7 thoughts on “ఇది మీకు భావ్యమా?

  1. కెసిఆర్ ది తాటి మట్ట కాదు బ్రదర్ CBN ది….. చిరంజీవి ది…. కాంగ్రెస్ ఆంధ్ర నాయకుల వి తాటిమట్టలు…..అవకాశవాదం కోసం తెలంగాణా ని సపోర్ట్ చేసి ఎప్పుడు ఇలా మాటల్లాడడం ఎంతవరకు నాయ్యం?…. అసెంబ్లీ లో తెలంగాణా ప్రొపొసల్ పెడితే సపోర్ట్ చేస్తాం అని చెప్పి ఇప్పుడు తెలంగాణా వారిని మోసం చేయడం ఆంధ్ర నాయకులకి బావ్యం కాదు …….

    • టపా పూర్తిగా చదవండి!. నేనెక్కడా కేసీఆర్ ని ప్రశ్నించలేదు. నేను ప్రశ్నించింది తెలంగాణా తెదేపా నాయకుల్నే..

వ్యాఖ్యలను మూసివేసారు.