తప్పుడు వైద్యం

ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఒక వైద్యుడు తన రోగి దగ్గరికెళ్ళి ఇలా అన్నాడు.

“నీకు ఒక శుభ వార్త, ఒక దుర్వార్త చెప్పాలి. ఈ రెండిటిలో  ఏది మొదటగా వినాలని ఉంది?” అని అడిగాడు.

ఆ రోగి ఆశ్చర్యంతో “సరే దుర్వార్త ముందు చెప్పండి” అన్నాడు.

“ఒక చిన్న పొరపాటు వల్ల, సమస్య ఉన్నది మీ ఎడమకాలు అయితే దానికి బదులుగా మీ కుడికాలును తీసివేశాం.”

కాసేపు బాధపడి “సరే! మరి శుభ వార్త ఏంటి?”

“మేం రిపోర్టులన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన మీదట మీ ఎడమకాల్లో ఏ సమస్యా లేదని తేలింది. కాబట్టి దానిని తీసివేయనవసరం లేదు.”

“ఆఆ!!!!!”

ఇది కేవలం సరదా కోసం రాసింది. ఎవరినీ నొప్పించే ఉద్దేశ్యం లేదని గమనించగలరు.