జీవితంలో డబ్బే ప్రధానం కాదు…ఓ సరదా కథ

హైదరాబాద్ లో ఉంటున్న ఓ ముసలాయన ఓ రోజు న్యూయార్క్ లో ఉంటున్న కొడుక్కి ఫోన్ చేశాడు.

“బాబూ నేనిలా నీ సమయం వృధా చేస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. మీ అమ్మ విడాకులు తీసుకోబోతున్నాం. “

“ఏం మాట్లాడుతున్నారు మీరు!” అటు వైపు నుంచి కొడుకు అరిచాడు.

“ఏమోరా! చాలు! 35 సంవత్సరాలుగా మేము పడ్డ బాధలు చాలు!! ఇక విడిపోవాలనుకుంటున్నాం. మేం మాత్రం ఖచ్చితంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం.నేను ఈ విషయం మీతో మాట్లాడాలంటే కూడా విసుగొస్తోంది. అలాగే హాంకాంగ్ లో ఉన్న మీ చెల్లెలికి కూడా ఫోన్ చేసి చెప్పు” తెగేసి చెప్పాడా తండ్రి.

అతను ఆందోళనగా చెల్లిలికి కూడా ఫోన్ చేశాడు.

“అసలేం అనుకుంటున్నారు వాళ్ళు. నువ్వుండు వాళ్ళతో నేను మాట్లాడతాను” చెల్లెలి వైపు నుంచి సమాధానం.

ఆమె వెంటనే హైదరాబాద్ కి ఫోన్ చేసి తండ్రిపై కోపంగా నాలుగు మాటలు మాట్లాడేసి చివరగా “అసలు నేను అక్కడికి వచ్చేంతవరకూ ఏమీ జరగడానికి వీల్లేదు. నేనూ అన్నయ్య కలిసి రేపే అక్కడికి వస్తున్నాం. సరేనా” హడావిడిగా ఫోన్ పెట్టేసింది.

ముసలాయన ఫోన్ పెట్టేసి భార్య వైపు తిరిగి నవ్వుతూ ఇలా అన్నాడు.

“హమ్మయ్య అంతా ఓకే! రేపు వాళ్ళు మన పెళ్ళిరోజుకు వస్తున్నారు. అది కూడా వాళ్ళ డబ్బుతో ప్రయాణం టిక్కెట్లు కొనుక్కొని!!!”

14 thoughts on “జీవితంలో డబ్బే ప్రధానం కాదు…ఓ సరదా కథ

 1. చాలా బాగుంది ఇప్పుడు ప్రపంచం ఇలాగే ఉంది నిజమైన ఆనందం అంటె ఎమిటొ జనాలకి అర్దం కావడం లేదు
  కొంతకాలం తరువాత పండించడానికి భుమి కూడ ఉండదు అప్పుడు డబ్బుల కట్టలతొ ఎం చెస్తారొ తెలియదు. idi saradaa kada kaadu

  • నిజమే.. ఇది సరదా కథ కాదు. నేనెప్పుడూ ఇలాంటి సీరియస్ కథలు రాస్తుంటే కొంత మంది చదవడం మానేస్తారని టైటిల్ లో అలా పెట్టా :). ఇది అందరూ తెలిసుకోవాల్సిన విషయమే కదా. కాబట్టి ఇలాంటి టెక్నిక్ లు వాడటం తప్పు లేదనుకుంటూన్నాను.

 2. బాగుందండి. సినిమాలల్లో అయితే, అమ్మకో, నాన్న కో సీరియస్ అని పిల్లల్ని పిలిపిస్తారు. ఇది కొత్తరకంగా సరదాగా ఉంది.

 3. మీరు ఏమి చెప్పదలచుకున్నారో నాకు అర్ధంకాలేదు. తల్లిదండ్రులు పిల్లలను చూడటానికి ఇంతటి అబద్దం చెప్పాలా. జీవితంలో డబ్బే ప్రధానం కాదు అనుకుంటూనే మానవత్వపు విలువలను తుంగలో త్రొక్కుతున్నారు మీరు. ఇంకా మంచిగా వ్రాసి ఉండాల్సింది.

  • ఇంకేం చేస్తామండీ… అలా అబద్ధాలాడితే గానీ వాళ్ళ రారని వాళ్ళ బలమైన నమ్మకం.
   తల్లి దండ్రులకు పట్టించుకోని బిడ్డలను ఒక ప్రాక్టికల్ జోక్ తో తమ దగ్గరకు రప్పించుకోవడం అనే దాన్ని వర్ణించడానికి ” మానవత్వాన్ని తుంగలో తొక్కడం” అంత పెద్ద పదాలు అవసరం లేదనుకుంటా…

 4. బాగుంది కథ సరదాగా.. 🙂 కానీ నాన్నా పులి కథ లాగా తర్వాత్తర్వాత పిల్లలు కూడా వీళ్ళిలాగే అంటార్లే అని అలవాటు పడిపోతే??

 5. సరదా కామెంట్(అంటే .. సరదాగా తీసుకొండి , రిప్లై ఇవ్వద్దు అని):
  మీ సరదా కథ , ఇండియాలో హిట్ , అమెరికాలో ఫ్లాప్.

వ్యాఖ్యలను మూసివేసారు.