జీవితంలో డబ్బే ప్రధానం కాదు…ఓ సరదా కథ

హైదరాబాద్ లో ఉంటున్న ఓ ముసలాయన ఓ రోజు న్యూయార్క్ లో ఉంటున్న కొడుక్కి ఫోన్ చేశాడు.

“బాబూ నేనిలా నీ సమయం వృధా చేస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. మీ అమ్మ విడాకులు తీసుకోబోతున్నాం. “

“ఏం మాట్లాడుతున్నారు మీరు!” అటు వైపు నుంచి కొడుకు అరిచాడు.

“ఏమోరా! చాలు! 35 సంవత్సరాలుగా మేము పడ్డ బాధలు చాలు!! ఇక విడిపోవాలనుకుంటున్నాం. మేం మాత్రం ఖచ్చితంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం.నేను ఈ విషయం మీతో మాట్లాడాలంటే కూడా విసుగొస్తోంది. అలాగే హాంకాంగ్ లో ఉన్న మీ చెల్లెలికి కూడా ఫోన్ చేసి చెప్పు” తెగేసి చెప్పాడా తండ్రి.

అతను ఆందోళనగా చెల్లిలికి కూడా ఫోన్ చేశాడు.

“అసలేం అనుకుంటున్నారు వాళ్ళు. నువ్వుండు వాళ్ళతో నేను మాట్లాడతాను” చెల్లెలి వైపు నుంచి సమాధానం.

ఆమె వెంటనే హైదరాబాద్ కి ఫోన్ చేసి తండ్రిపై కోపంగా నాలుగు మాటలు మాట్లాడేసి చివరగా “అసలు నేను అక్కడికి వచ్చేంతవరకూ ఏమీ జరగడానికి వీల్లేదు. నేనూ అన్నయ్య కలిసి రేపే అక్కడికి వస్తున్నాం. సరేనా” హడావిడిగా ఫోన్ పెట్టేసింది.

ముసలాయన ఫోన్ పెట్టేసి భార్య వైపు తిరిగి నవ్వుతూ ఇలా అన్నాడు.

“హమ్మయ్య అంతా ఓకే! రేపు వాళ్ళు మన పెళ్ళిరోజుకు వస్తున్నారు. అది కూడా వాళ్ళ డబ్బుతో ప్రయాణం టిక్కెట్లు కొనుక్కొని!!!”