తెలుగు బ్లాగుల దినోత్సవం

నేను బ్లాగు ప్రారంభించి ఐదు నెలలైంది. ప్రారంభించినప్పటి నుంచీ బ్లాగుల్లో ఎంతో మందితో పరిచయం కలిగింది. అప్పటి నుంచి నాకు ఇదో ప్రత్యేకమైన ప్రపంచమైపోయింది.

ఈ ఆదివారం అంటే 13 వ తేదీన హైదరాబాద్, యూసుఫ్ గూడ బస్తీ, కృష్ణకాంత్ ఉద్యానవనం లో తెలుగు బ్లాగుల దినోత్సవం జరుగుతుంది. సమయం సాయంత్రం మూడు గంటల నండి ఐదు వరకు ఉండవచ్చు.ఈ సమాచారం అధికారికంగా ఎక్కడా వెలువడలేదు కానీ సాధారణంగా ఇక్కడే జరుగుతుంటుంది.

తెలుగు బ్లాగులు రాసేవారు, చదివేవారు ఇక్కడకు వస్తే కలవాలని ఎంతో ఆశగా ఉన్నది. మీ కోసం ఎదురు చూస్తుంటాను.

ప్రకటనలు

12 thoughts on “తెలుగు బ్లాగుల దినోత్సవం

 1. ౩౦ మంది కి పైగా విచేసిన సభ లో
  రాత్రి పదకొండువరకు జరిగిన సమావేశం లో
  మీ disussions లో మార్తాండ topic వచ్చిందా 🙂

  • 🙂 నేను రాత్రి వరకు ఉండలేదండీ! ఆరుగంటలకు సుజాత గారితో కలిసి కొండాపూర్ వచ్చేశాను. నేను ఉన్నంత వరకు ఆ టాపిక్ రాలేదు.

 2. రవిచంద్ర గారు:
  అక్కడ జరిగిన సమావేశం గురించి, జరిగిన చర్చ గురించిన వివరాలతో ఒక టపా వ్రాస్తారని ఆశిస్తున్నాను.

 3. తెలుగు బ్లాగర్ల సమావేశం గురించి తెలిసి ఆనందంగా ఉంది…మీరు వెళ్ళారా?
  ఫొటోలు బాగున్నాయి. సమావేశానికి హాజరు అవగలనని ఆశిస్తున్నాను.
  జరిగిన సమావేశం వివరాలతో ఒక టపా రాయండి, తెలుసుకోవాలని ఆశగా ఉంది.

వ్యాఖ్యలను మూసివేసారు.