జీవితపు పార్శ్వాలు

ఒక బాగా కలిగిన కుటుంబంలో తండ్రి తన కుమారుడిని పేద వాళ్ళ బాధలను ప్రత్యక్షంగా వీక్షించడానికి కొంచెం వెనుక బడిన ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఒక కుటుంబంతో రోజంతా అక్కడే గడిపారు. అక్కణ్ణుంచి ఇంటికి వచ్చిన తర్వాత తన కుమారుణ్ణి ఆ అనుభవం ఎలా ఉంది అని అడిగాడు?

“చాలా బాగుంది నాన్నా”

“దీన్నుంచి నువ్వేమి నేర్చుకున్నావు?”

“మనకు ఇంటి దగ్గర ఒక కుక్క ఉంది. వాళ్ళకు నాలుగు కుక్కలున్నాయి. మన తోట మధ్యలో చిన్న కొలను ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర కనుచూపు మేరలో కనిపించే పిల్ల కాలువ ఉంది. మన తోటలో ఇంపోర్టెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. వాళ్ళకి మిల మిల లాడే నక్షత్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. మన వాకిలి గేటు వరకే. కానీ వాళ్ళకి దిజ్ఞండలం అంతా వాకిలే.”

వాళ్ళ నాన్నకు ఇక మాటలు రాలేదు. ఆయన ఆ ఆశ్చర్యం నుంచి తేరుకోక ముందే

” చాలా థాంక్స్ నాన్నా. దీని వల్ల మనం ఎంత పేద వాళ్ళమో అర్థమయ్యింది”

నిజమే కథా! అంతా మనం చూసేదాని బట్టి ఆధారపడి ఉంటుంది. మనల్ని ప్రేమించే నలుగురు శ్రేయోభిలాషులు, కుటుంబం, స్నేహితులు, ఆరోగ్యం, ఉల్లాసం, జీవితం పట్ల ఆశవహ థృక్పథం ఇవే కావాల్సింది. ఇవి ఉంటే అన్నీ ఉన్నట్లే. వీటిల్లో మనం ఏవీ కొనలేం.

ప్రకృతిని నాశనం చేసి కాదు. ప్రకృతితో కలిసి జీవిద్దాం.

సర్వేజనా సుఖినీభవంతు.