నీ కోరికేంటి? :)

ఒక ధనవంతుడికి పెళ్ళికాని అందమైన కూతురుండేది. ఆయన తన బంగళా వెనుక ఒక కొలనులో భయంకరమైన మొసళ్ళను పెంచేవాడు.  ఒక రోజు ఆయన పెద్ద పార్టీని ఏర్పాటు చేసి చాలా మందిని ఆహ్వానించాడు. అందులో ఇలా ప్రకటించాడు.

“ఇక్కడున్న యువకులందరికీ ఒక అద్భుతమైన అవకాశం. ఎవరైతే ఈ సరస్సులో దూకి మొసళ్ళ నుండి తప్పించుకుని బయటకు ఈదుకుని వస్తారో వారికి నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తాను లేదా ఒక మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తాను”.

ఆయన మాటలు పూర్తి కాక ముందే ఎవరో నీళ్ళలో దూకిన చప్పుడైంది. నీళ్ళలో ఒక యువకుడు తన శాయశక్తులా ఈదుతూ వస్తున్నాడు. పార్టీకి విచ్చేసిన అతిథులంతా అరుస్తూ అతన్ని ఉత్సాహపరుస్తున్నారు. చివరికి చిన్న చిన్న దెబ్బలతో, చిరిగిపోయిన చొక్కాతో అవతలి ఒడ్డుకి చేరుకున్నాడా యువకుడు.

ఆ ధనవంతుడు ఆశ్చర్యంతో దగ్గరికి వచ్చి ” నాకు నిజంగా నమ్మశక్యం కాకుండా ఉంది. పరమాద్భుతం. ఇది ఎవరూ పూర్తి చేస్తారని అనుకోలేదు. కానీ నేను మాట తప్పను. చెప్పు. నీకు మా అమ్మాయి కావాలా? ఒక మిలియన్ డాలర్లు కావాలా?”

“నాకు నీ కూతురూ వద్దూ, ఆ మిలియన్ డాలర్లూ వద్దు. ముందు నన్ను నీళ్లలో తోసిన వాణ్ణి చూపించండి!!!!” 🙂