ఒకాయన తన మిత్రుడితో పందెం కాశాడు. ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చార్మినార్ దగ్గర అడుక్కుంటే రెండు వేల రూపాయలిస్తానని.
పందేనికి ఒప్పుకున్న మిత్రుడు ఒప్పందం ప్రకారం భిక్షగాడిలా వేషం వేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు అడుక్కున్నాడు.
పందెం ఓడిపోయిన మిత్రుడు అలాగే రెండు వేల రూపాయలిచ్చేశాడు.
మరుసటి రోజు చార్మినార్ పక్కనే వెళుతుండగా అతనికి తన మిత్రుడు మళ్ళీ భిక్షగాడి రూపంలో అడుక్కుంటూ ఉండటం కనిపించింది.
నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళి ” ఒరే! నీ కిదేం పొయ్యే కాలం. నిన్నైతే నాతో పందెం వేసుకున్నావ్. ఈ రోజు కూడా ఎందుకు అడుక్కుంటున్నావ్?” అని అడిగాడు.
“ష్…గట్టిగా అరవకు. ఇన్కమ్ బాగుంది గురూ.. అందుకనే కంటిన్యూ అయిపోతున్నా…”
ప్రకటనలు