ఆల్కహాలు ప్రభావం :)

ఐదో తరగతి విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు రసాయన శాస్త్రం బోధిస్తున్నాడు. ఆల్కహాలు దుష్పరిణామాల గురించి సోదాహరణంగా వివరించాలని వాళ్ళకి ఒక ప్రయోగం ద్వారా బోధించాలనుకున్నాడు. ఒక గ్లాసులో విస్కీ, ఒక గ్లాసులో మంచి నీళ్ళు తీసుకున్నాడు. రెండు పురుగులను చెరొక గ్లాసులో జారవిడిచాడు.

“ఇప్పుడు రెండు గ్లాసులోని పురుగుల్ని జాగ్రత్తగా గమనించండి.” పిల్లలకు చెప్పాడు.

విస్కీ గ్లాసులో వేసిన పురుగు కాసేపు అటూ ఇటూ కొట్టుకుని చనిపోయి గ్లాసు అడుగు భాగంలోకి వెళ్ళిపోయింది. మరో వైపు నీళ్ళలో విడిచిన పురుగు మామూలుగానే ఉంది.

“ఇప్పుడు దీన్ని బట్టి మీకు తెలిసిందేమిటి?” విద్యార్థుల్ని అడిగాడు

ఒక కొంటె విద్యార్థి లేచి “కడుపులో పురుగులు పోవాలంటే విస్కీ తాగాలి సర్ “ 🙂

6 thoughts on “ఆల్కహాలు ప్రభావం :)

 1. ఇది ఒక పాత జోకు ఒక సారి గుర్తు చేద్దామని

  ఆద్రుస్టవంతుడు
  అమెరికా జీతం, ఇంగ్లండ్ ఇల్లు. చైనా బోజనం, ఇండియన్ భార్య

  దురద్రుస్టవంతుడు

  అమెరికా భార్య, ఇంగ్లండ్ బోజనం, చైనా ఇల్లు, ఇండియన్ జీతం

  సరదాకి మాత్రమె నిజం
  కాదు

వ్యాఖ్యలను మూసివేసారు.