లీడర్ విశేషాలు…

హ్యాపీడేస్ సినిమా తర్వాత లీడర్ సినిమా కోసం శేఖర్ కమ్ముల చాలా సమయం తీసుకున్నాడు. ఈ సమయమంతా ఈ సినిమా కోసమే వెచ్చించానని నిన్న జరిగిన లీడర్ ఆడియో ఫంక్షన్ లో తానే స్వయంగా వెల్లడించాడు. సినిమా రూపకల్పన సమయంలో జరిగిన కొన్ని దురదృష్టకరమైన సంఘటనల వల్ల సినిమా నిర్మాణం ఆలస్యమైందంటూ చెప్పుకొచ్చాడు. బహుశ వై.యస్. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని గూర్చి ప్రస్తావించి ఉండవచ్చు. ఎలక్షన్ల సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు, కొన్ని నిజజీవితంలో జరిగిన సంఘటనలు కూడా ఈ సినిమాల్లో చోటు చేసుకోబోతున్నాయనని శేఖర్ మాటల ద్వారా గ్రహించవచ్చు. సినిమా టైటిల్ ని బట్టి కథ ఎవరైనా ఊహించదగ్గదే. ఒక లీడర్ ఎలా ఉంటే దేశం బాగుపడుతుందనే కొన్ని ఆలోచనల సమాహారమే ఈ చిత్ర కథ.

మిక్కీ జె మేయర్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలు శేఖర్ అభిరుచికి తగ్గట్టుగానే ఉన్నాయి.  ముందు సినిమాలకు ఏ మాత్రం తీసివేయలేనివి. సినిమాలో పాటలన్నీ వేటూరి గారిచే రాయించారు. భావ గర్భితమైన వేటూరి సాహిత్యాన్ని అణచివేయకుండా అందంగా స్వరపరచిన మిక్కీ జె మేయర్ సంగీతం తెలుగు భాషాభిమానులకు శుభవార్త. అయితే ఈ సారి ఒక ఐటమ్ సాంగ్ అదనం. అయితే మామూలు ఐటమ్ సాంగ్ లా కాకుండా అందరూ వినదగేలా ఉంది. సినిమాలో ఈ పాటకు ప్రముఖ యాంకర్ ఉదయభాను నర్తించినట్లు సమాచారం.

హీరో రాణా కూడా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా వేదిక మీదకు వచ్చి మాట్లాడాల్సిన నాలుగు మాటలను క్లుప్తంగా స్పష్టంగా మాట్లాడి  ముగించాడు. కార్యక్రమానికి హాజరైన అతిథులందరిలో(పెద్దలందరితో సహ) స్పష్టంగా మాట్లాడిన అతి కొద్ది మందిలో వారిలో రాణా ఒకడు. ఒక దశలో రామానాయుడు కూడా తడబడ్డాడు. వెంకటేష్ ఏ మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియలేదు. సురేష్ బాబు వచ్చి తనకు తెలుగే తెలియదన్నట్లుగా మొత్తం ఇంగ్లీషులోనే మాట్లాడేసి వెళ్ళిపోయాడు. అతిథులు ఇంగ్లీషు మాట్లాడుతున్నంత సేపు ఫ్యాన్స్ “తెలుగు తెలుగు… ” అని అరుస్తుండటం క(వి)నిపించింది. సంతోషం. 🙂

10 thoughts on “లీడర్ విశేషాలు…

 1. షేఖర్ తదుపరి సినిమా కోసం ఆత్రం గా ఎదురుచూస్తున్న మాకందరికి మీ టపా మంచి ఆనందాన్ని ఇచ్చింది, ధన్యవాదములు 🙂

  • అవును బాగా పొడుగ్గా ఉన్నాడు. దానికి తగ్గ లావుంటే ఆజానుబాహుడే…

  • నిజమే ఇప్పటి దాకా వచ్చిన కొత్త హీరోల్లో ఇతనికున్న వాయిస్ వేరేవాళ్ళకి లేదు.

 2. I felt Micky’s is a wrong pick for political kinda of movie. Audio lacked the maturity in terms tunes and singer’s voices which is reqd for this genre of movies. SPB or some one some senior could have done better job.

  But I am +ve about the movie 🙂 promos are really good.

 3. All songs are good and tuneful, Micky is right choice. But micky has come out from happy days fever (aunana kadana remembers his old work oh my friend).

  Nice to hear maa telugu talli ki ( Sakarambadi Sundarachari,Tanguturi suryakumari version ) and Srilu pongina (Rayaprolu Subbarao)

వ్యాఖ్యలను మూసివేసారు.