ఎవర్నీ నమ్మొద్దు.. :-)

ఒక దొంగ ఒక దుకాణంలోని సేఫ్ ని దోచుకోవాలనుకున్నాడు.
దగ్గరకు వెళ్ళేసరికి దాని తలుపుపైన
“దయచేసి తలుపును ఊడదీయడానికి డైనమైట్లు లాంటి వాటిని వాడే పనులు పెట్టుకోవద్దు. తలుపు తెరిచే ఉంది. హ్యాండిల్ ని తిప్పండి చాలు. తెరుచుకుంటుంది”.
దొంగ అలానే తిప్పాడు
అంతే!! వెంటనే ఒకె పెద్ద ఇసుక బస్తా వచ్చి నడ్డి మీద పడింది. ఆ ప్రదేశమంతా ఫ్లడ్‌లైట్ల వెలుగుతో నిండిపోయింది. కుయ్ కుయ్ మంటూ అలారం మోగసాగింది.
ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు దొంగకి.
పోలీసులు అతన్ని స్ట్రెచర్ పై తీసుకువెళుతుండగా అతను ఏదో సన్నగా మూలుగుతున్నాడు
“మనుషులపై నాకున్న నమ్మకం దారుణంగా దెబ్బతింది” 🙂

8 thoughts on “ఎవర్నీ నమ్మొద్దు.. :-)

  1. ఈ జోకు నిన్నటి సూర్య దినపత్రిక ఆదివారం అనుబంధంలో చదివాను.

    • నేను సూర్య పత్రిక అసలు చదవను. నేను వేరేచోట నుంచి సేకరించిందే…

వ్యాఖ్యలను మూసివేసారు.