రింగ రింగా పాట వివాదం

నిన్ననే గ్రేట్ ఆంధ్ర వెబ్‌సైటులో చదివాను. లోక్ సత్తా వాళ్ళు ఈ పాట అసభ్యంగా ఉందని లీగల్ నోటీస్ ఇవ్వబోతున్నారని. నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇంతకంటే భయంకరమైన బూతు పాటలు వచ్చినపుడు వీళ్ళంతా ఏంచేస్తున్నారా అని. అసలు విక్రమార్కుడు సినిమాలో జింతాతా పాట కంటే అసభ్యకరమైన పాట ఇప్పటి వరకు తెలుగు సినీ చరిత్రలో రాలేదని నా అభిప్రాయం. (మీకు ఏవైనా పాటలు ఇంతకన్నా బూతు అనిపిస్తే అభిప్రాయాల్లో రాయండి) అయినా అది ప్రేక్షకులను చాలామందిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్ర దర్శకుడు రాజమౌళిని ఒక విలేఖరి ఇంటర్వ్యూ చేస్తూ ఆయన సినిమాల్లో ద్వంద్వార్థపు పాటలు గురించి అడిగితే అవి తనకు ఇష్టమనీ అందుకే తన సినిమాల్లో పెట్టుకుంటున్నానీ బాహాటంగా సమాధానమిచ్చాడు.

దాంతో పోలిస్తే ఈ పాటలో మరీ డైరెక్టు బూతులేమీ లేవు. కానీ జనాలు ఈ పాటలో బీట్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పాటలో సాహిత్యాన్ని అర్థం చేసుకుని అది రంజుగా ఉందని ఆనందించే స్థాయికి సగటు శ్రోతలు ఎదగలేదని నా అభిప్రాయం.

16 thoughts on “రింగ రింగా పాట వివాదం

 1. sagatu shrota ki artham avutundi… lyrics enjoy chessagatu kanuke ilanti patalu vastunnayi…
  mana lanti shrotalu mareee open minded ga edigaru, anduke enni chetha patalu vachina vini vadilestunnaru 😦 (naku 50% patalu artha rahitam ga asabyam ga anipistayi… migata 50% toh sari pettukuntunna)
  paiga ee social policing jaripe vallu deniki react avutaro deniki avaro anthu chikkani prashna…

 2. నిజమే జింతాత పాట మగవాడు ఆడదాని మీద పాడిన పాట కాబట్టి బూతయ్యింది, ఈ పాట ఆడది పాడుకుంది కాబట్టి పరవాలేదు అనిపించుకుంటోంది. ఇది నైతికతకి సంబంధించిన వ్యవహారం అవునో కాదో నాకు తెలియదు, కానీ మన దిగజారుడుతనాన్ని (ఆలోచనల్లో, రసాశ్వాదన్లో)ఇలాంటి సాహిత్యాన్ని బీట్ బాగుంది అనుకుంటూ విని ఎంజాయ్ చెయ్యటం సూచిస్తోంది. చాలా ఎదిగిపోయాము మనం

 3. ఆ పాటలో ఏముందో నాకు తెలియదు. డబల్ మీనింగ్ లు కాకుండా డైరెక్ట్ బూతులు ఉన్నాయని విన్నాను. “ఆట” కార్యక్రమంలో డబల్ మీనింగ్ పాటలకి ఐదారేళ్ళ పసి పాపలు కూడా స్టెప్పులు వెయ్యడం చూశాను. ఈ డాన్సులు వీళ్ళకి అనాగరికం అనిపించవా?

 4. Srothalu Sahithyanni kooda gamanistharu babu.
  Srothalu yedugudala Ekkuve nayana.
  Vari yedugudala gurunchi nee Abhiprayam Tappanukunta !
  Beet , Ramju la hadavidilo Sahithyam patre pradhanam.
  64 kalalo edi oka kala.

 5. ఈ మధ్య అందరు ఇదొక్కటి నేర్చారు….కాంగ్రెస్సు వాళ్ళు నేర్పించినట్లున్నారు….
  “ఇది తప్పు” అంటే….”అది తప్పు కాదా?” అని ఎదురు ప్రశ్నించడం బాగా అలవాటయ్యింది…
  అయ్యా…మీకు జింతాత పాట తప్పు అనిపిస్తే..దాన్ని కూడా కలిపి తిట్టండి…అంతే గాని దాని ముందు ఇదెంత అని తీసి పారెయ్యకండి…
  తప్పు తప్పే…..అది సమాజాన్ని నాశనం చెయ్యకముందే మేల్కొంటే మంచిది….

  • మీ వాదనతో నేను అంగీకరిస్తున్నాను. నేనన్నది కూడా అదే ఈ పాటను తప్పు పట్టిన వాళ్ళు ఆ పాటను ఎందుకు తప్ప పట్టలేదు అని…

   • @రవిచంద్ర:

    హరీష్ అడిగేది ‘ఎదురు దాడి ఎందుకు’ అని. మీరతనితో ఏకీభవిస్తున్నానంటూనే మళ్లీ అదే పని చేస్తున్నారు 🙂

 6. ఇండియాలో సెక్స్ అంటే ఏమిటో తెలియని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సాధారణ పల్లెటూరివాళ్ళకి డబల్ మీనింగ్ పాటలు అర్థం కావు. ఒకవేళ అర్థం తెలిస్తే ఆ పాటలు విన్నందుకు సిగ్గు పడాలి కదా. టి.వి.లో “ఆట” లాంటి కార్యక్రమాలలో ఆరేళ్ళ పసిపాపల చేత వాళ్ళకి అర్థం తెలియని డబల్ మీనింగ్ పాటలకి డాన్సులు చెయ్యిస్తారు. కొంచెం పెద్దమ్మాయి అయితే ఆ పాటకి అర్థం తెలిసి డాన్స్ చెయ్యడానికి సిగ్గు పడుతుంది. పసిపాపకి అర్థం తెలియదు కాబట్టే ఎలాంటి మొహమాటం లేకుండా డాన్స్ చేస్తుంది. పల్లెటూరివాళ్ళు అర్థం తెలియక డబల్ మీనింగ్ పాటల శ్రవణం చేస్తే మనం కూడా ఆ పాటలు శ్రవణం చెయ్యాలా?

 7. నేను మీతో భయంకరంగా ఏకీభవిస్తున్నానండి. అయ్యబాబోయ్… జింతాత పాట… మొదటిసారి సినిమా చూస్తున్నప్పుడైతే ఎంత ఏడుపొచ్చిందో… ఆ పాటలో రాతల్ని భరించలేక…

 8. నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను. మరి సెన్సార్ వాళ్ళు ఏమి చేస్తున్నట్టు?

  • మంచి ప్రశ్న వేశారు. అందరూ మర్చిపోయిన వారి గురించి గుర్తు చేసినందుకు థాంక్స్. 🙂

వ్యాఖ్యలను మూసివేసారు.