శిక్ష తప్పించుకోవడం ఎలా?

ఒక భారతీయుడు, ఒక అమెరికన్, ఒక పాకిస్థానీయుడు సౌదీ అరేబియాకు చెందిన విమానంలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. వారు చేసిన నేరానికి శిక్షగా ఒక్కొక్కరికీ 20 కొరడా దెబ్బలు శిక్ష విధించారు అధికారులు. వారు ముగ్గురూ శిక్షకు సిద్ధపడుతుండగా శిక్షను అమలుపరిచే షేక్ వచ్చి ఇలా ప్రకటించాడు. “ఇవాళ నా ప్రియమైన మొదటి భార్య పుట్టిన రోజు. కాబట్టి మీకు శిక్ష విధించబేయే ముందుగా మిమ్మల్ని ఒక కోరిక కోరుకోమంది” అన్నాడు

మొదటగా అమెరికన్ వంతు వచ్చింది. అతను కొద్ది సేపు ఆలోచించి  తన వీపుకు ఒక దిండును కట్టమన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ అది పది దెబ్బలకే చినిగిపోయింది. మిగతా పది దెబ్బలూ భరించే సరికి రక్తం కారే గాయాలైపోయాయి.

తరువాత పాకిస్థానీ వంతు వచ్చింది. తనకు రెండు దిండ్లు కట్టమన్నాడు. అతని దురదృష్టం కొద్దీ అది పదిహేను దెబ్బలకే తట్టుకోగలిగింది. తరువాత భారతీయుడి వంతు వచ్చింది. అతను ఏమీ అనకముందే షేక్ “నువ్వు మంచి సంస్కృతి గల దేశం నుంచి వచ్చావు. మీ దేశం అంటే నాకు ఎంతో ఇష్టం. కాబట్టి నువ్వు రెండు కోరికలు కోరుకోవచ్చు” అన్నాడు.

“మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. నా మొదటి కోరిక ఏంటంటే నాకు ఇరవై కాదు నూరు కొరడా దెబ్బలు కావాలి”

“చూస్తుంటే నువ్వు మంచి ధైర్యవంతుడిలాగా కనిపిస్తున్నావు. సరే నీ రెండో కోరిక ఏమిటి?”

“ఆ పాకిస్థాన్ వాణ్ణి నా వెనక కట్టేయండి.” 🙂

14 thoughts on “శిక్ష తప్పించుకోవడం ఎలా?

 1. ఒరిజినల్ జోక్ లో పాకిస్తాన్ వాడి భార్యను నాకు ఇచేయండి అని కోరుకుంటాడు కదా !

 2. ఇలాంటిదే ..ఇంకోటి

  ఒక షిప్ లో ప్రయాణికులు ఎక్కువై మునిగి పోయే ప్రమాదం వుండటం తో
  షిప్ కెప్టెన్ .. ఎవరినైనా దూకి అందరిని రక్షించమంటారు .
  మొదట ఒక సింగ్ జై బారత్ మాత కి అని దూకుతాడు . తర్వాత ఒక జర్మన్ హెయిల్ జర్మని అని దూకుతాడు .
  కెప్టెన్ ఇంకా ఒకరు ప్రాణత్యాగం చేస్తే షిప్ లో వున్నా అందరు క్షేమంగ వుంటారని చెబితే ,
  ఒక పాకిస్థాని జై పాకిస్తానీ అని పక్క వాడిని తోసేస్తాడు …

 3. ఇదే జోక్ ను పాకిస్తాన్ వాళ్ళు ఇండియా ప్లేస్ లో పాకిస్తాన్, పాకిస్తాన్ ప్లేస్ లో ఇండియాను పెట్టుకొని ఆనందిస్తారు అనుకుంట.

  పూర్తిగా కాపాడలేని దిండుకు బదులు మనకు నచ్చని వాడిని మనకు అడ్డుపెట్టుకొని శిక్ష వాడు అనుభవించేలా చేయడం అనే బేసిక్ కాన్సప్ట్ అదిరింది. great one

వ్యాఖ్యలను మూసివేసారు.