వోల్‌ఫ్రమ్ ఆల్ఫా

కొన్ని నెలల క్రిందట ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ వోల్‌ఫ్రమ్ మామాలు సర్చ్ ఇంజన్ ల కన్నా విభిన్నమైన సెర్చింజన్ తయారు చేశాడు. సందర్శకులు ఏదైనా సమాచారం కోసం దీనిలో వెతికినపుడు ఆ సమాచారాన్ని కలిగి ఉన్నట్లుగా భావిస్తున్న కొన్ని పేజీల జాబితాను ఇవ్వకుండా మీరు ఇచ్చిన ఇన్‌పుట్ ను విశ్లేషించి పట్టిక రూపంలో సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఇందుకోసం వెబ్‌సైట్ నిర్వాహకులు కూర్చుకున్న ప్రత్యేకమైన డేటాబేస్ ను వాడతారు. ఈ డేటాబేస్ లో ముందుగా ఫార్మాట్ చేసుకున్న సమాచారం ఉంటుంది. దీన్ని ఆయా సబ్జెక్టులకు సంబంధించిన నిపుణులు తయారు చేస్తారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే గణిత, రసాయన, భైతికసమీకరణాలను సాధిస్తుంది. ఉదాహరణకు Integrate(x^2+x) అనే ఇన్‌పుట్ ఇచ్చామనుకుందాం. దాని అవుట్‌పుట్ ఇలా ఉంటుంది.

wolframalpha output
అవుట్‌పుట్

ఉదాహరణకు మీరు ఏదైనా నగరం గురించి వెతికారనుకుందాం. ఆ నగరం గురించి అతి ముఖ్యమైన సమాచారాన్ని మొత్తం ఒక పట్టిక రూపంలో చూపిస్తుంది. అయితే ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు చెబుతున్న దాని ప్రకారం ఈ వ్యవస్థ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటు లోకి రావడానికి కొన్నేళ్ళు పడుతుంది. అలా వచ్చిన తర్వాత మనం ఒక ప్రశ్న దానికి ఇన్‌పుట్ గా ఇచ్చినా అర్థం చేసుకుని దానికి సమాధానం ఇచ్చే స్థాయికి ఇది చేరుతుంది.

విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది . గణిత, భౌతిక, రసాయన శాస్త్రాలతోపాటు వైద్య, సామాజిక, ఆర్థిక, సాంకేతిక, జీవ శాస్త్రం, ఒకటేమిటి చాలా శాస్త్రాల పరిజ్ఞానం ఇమిడి ఉంది.

5 thoughts on “వోల్‌ఫ్రమ్ ఆల్ఫా

    • ఒక్క మాటలో చెప్పాలంటే మనకు ఏదైనా ఖచ్చితమైన సమాచారాన్ని వెబ్ పేజీల్లో చదివి వెతుక్కోకుండా ఉండాలంటే దీన్ని వాడవచ్చు.

వ్యాఖ్యలను మూసివేసారు.