రియాల్టీ షో లా? బూతు పురాణాలా?

ఈ మద్యనే జీటీవీలో ప్రసారమవుతున్న ఆట జూనియర్స్ కార్యక్రమం చూడవలసి వచ్చింది. ఇద్దరు మెంటర్ల మద్య చెలరేగిన వాగ్యుద్ధం చివరికీ అందరికీ పాకింది.

ఒక మెంటర్ (తెలుగులో మార్గదర్శకులు అందాం). ” హలో మీరు xxx, xxx  మూసుకుంటే బాగుంటుంది.” అంది . ఒక్క క్షణం దిమ్మ తిరిగిపోయింది నాకు.  దాన్నుంచి తేరుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. (xxx, xxx సెన్సార్ కట్ అన్నమాట. నేనే కాదు టీవీలో కూడా కత్తెరేశారు సదరు మాటల్ని)

మళ్ళీ మాటీవీలో ప్రసారమవుతున్న చాలెంజ్ కార్యక్రమంలో ఒక న్యాయ నిర్ణేత పై మాటలు అన్న  ఆమె మీద ఇలా అరుస్తున్నాడు.

” నీ లాంటి వేస్ట్ ఫెలో ని నా లైఫ్ లో నేనింత వరకు చూడలేదు”. ఇలా ఏవేవో అవాకులూ చెవాకులూ, చూసేవాళ్ళకు చిరాకులూ.

ఎవరో కొంత మంది అనామకుల్ని పట్టుకుని వాళ్ళతోనే అన్ని కార్యక్రమాలు చేయించి ప్రేక్షకుల్ని  శిక్షిస్తున్న  ఆ హింసరాజు ను ఏమనాలో నాకు తోచలేదు. వాళ్ళ మ్యానరిజమ్స్, ఏడుపులు, పెడబొబ్బలు టీవీ కార్యక్రమాలంటేనే ఏహ్య భావం కలిగించేలా అనిపించాయి నాకు. టీ.ఆర్.పి రేటింగ్ ల కోసం ఒకటి తర్వాత ఒకటి టీ వీ చానల్స్ కూడా అతని కార్యక్రమాలను ఎగబడి  కొనుక్కుంటూ ఉండటం మరీ దారుణం.

ఓ దేవుడా! ఈ ఘీంకార్ బారి నుంచి మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తావు?

ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. అన్ని చానళ్ళలో వస్తున్న రియాల్టీ షోలలో ఇది పరిస్థితి నెలకొని ఉన్నది.

41 thoughts on “రియాల్టీ షో లా? బూతు పురాణాలా?

  • దాదాపు అలాంటి అనుభవమే నాకూ ఎదురైంది. కాకపోతే నేను ఇక్కడ తప్ప మరెక్కడా నా బాధ వెళ్ళగక్కలేను. 🙂

   • వాళ్ళ కంటే పల్లెటూర్లలో రికార్డింగ్ డాన్సులు చేసేవాళ్ళే నయం. వాళ్ళు పొట్టకూటి కోసం చేస్తారు, వీళ్ళు తిన్నది అరక్క చేస్తారు. అదే ఫండమెంటల్ తేడా. కథకి మొదట్లో “సంస్కృతి” అని టైటిల్ పెట్టాలనుకున్నాను. మనిషిని కట్టడి చేసే ఆర్థిక అంశాల గురించి కూడా వ్రాయడం వల్ల టైటిల్ మార్చాల్సి వచ్చింది. నిజానికి ఆ కథ యొక్క మెయిన్ పర్పోస్ సంస్కృతిని డిఫెండ్ చెయ్యడానికే.

 1. ఆ “వేస్ట్ ఫెలో” కార్యక్రమం నేను కూడా చూసి సరిగ్గా ఇలాంటి నిర్ణయానికే వచ్చాను. ఆ show ఇంకెప్పుడూ చూడకూడదని ఒట్టేసుకున్నా.

 2. నాకు ఆ ఓంకార్ అంటే చాలా ఇష్టం.

  మీరన్నట్టు శ్రుతి మించుతుంది. అలా మించడం, అదే చూడాలని కోరుకుంటున్న ప్రేక్షకులు వున్నంతకాలం ఏమీ చేయలేము.

  ప్రతీది వ్యాపారం కాబట్టి we can’t blame channels also.

  ప్రపంచాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకు కానిది, మనకు చెందనిది, మనకు సంబంధం లేకుండా డిస్ట్రబెన్స్ జరుగుతూ వుంటే మనం ఎంజాయ్ చేస్తాము. అదే వీక్ నెస్ , ఆ ప్రోగ్రామ్స్ కు ఆదరణకు కారణం.

  ఇంతగా hate చేసే మీరు, ఈ పోగ్రాంను చూడటం మానరు. ఎందుకుంటే మీ బాద చెప్పుకోవడానికి మళ్ళి మళ్ళి చూస్తూనే వుంటారు.

  రోజు రోజుకూ “ఏదో తప్పు జరుగుతుంది కాని నేను మాత్రం తప్పు చేయడం లేదు అనే భావన” ప్రతి ఒక్కరిలో పెరుగుతుంది.

  Note: నా పాయింట్ చెప్పడానికి “మనం”, “మీరు” అని వాడాను తప్ప, I don’t really mean it. ఇప్పుడు మీరు ఆ పోగ్రామ్స్ మానేసి వుండవచ్చు.పర్సనల్ గా తీసుకోకుండా నేను చెప్పే పాయింట్ catch చేయమని చెప్పడానికే ఈ note.

  • నేను ఆయన కార్యక్రమాలను సాధారణంగా చూడను. మా రూమ్మేటు ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే భరించానంతే. చూడవల్సి వచ్చింది అనే నీలం రంగులో రాసినా అర్థం చేసుకోలేకపోయారు మీరు. 🙂

   • @a2zdreams మీరు నోట్ పెట్టినా నాకెందుకో సమాధానం ఇవ్వాలనిపించింది.లేకపోతే ఇంకొకరు కూడా మీ లాగే అర్థం చేసుకుంటారేమో అని.మీరు కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దని మనవి 🙂

   • @a2z అర్థం కాకపోయినా పర్లేదు. చూడవలసి వచ్చింది అన్నదానికి వివరణ ఇవ్వాలనుకున్నాను. ఇచ్చేశాను. అంతే!

   • @venkyనిజమే వెంకీ గారు. అతను ఎందరికో లైఫ్ నిచ్చాడు. అలాంటి వారు తమ ఇళ్ళలో అతని ఫోటో పెట్టుకుని పూజించుకుంటున్నారని మా అక్క చెప్పింది. అది ఎంతవరకు నిజమో.

 3. అసలు మన టీవీ లు రాని దేశం లో వుండబట్టి బ్రతుకుతున్నాను ప్రశాంతం గ ప్రస్తుతానికి . అసలు టీవీ లేకుండా వుంటే బావుంటుంది . చాల టైం మిగులుతుంది . ఈ చెత్త చూసే బాధ తప్పుతుంది … 😉

 4. ఇందాకే ఈ విషయం మా బావమరిదికి చెప్పాను. జూనియర్స్ కార్యక్రమం అంటే పిల్లల కార్యక్రమం కదా, పిల్లలు కూడా అలాంటి మాటలు ఆడుతారా అని తిరిగి నన్నే అడుగుతున్నాడు.

  • నీ చెరసాల కధకు ఫీడ్ బ్యాక్ రాయొచ్చా అయితే లింక్ ఇవ్వు తర్వాత మీ విరోచనానికి ఫీడ్బాక్ prescription ఇద్దాం

 5. ఎవరీ ఓంకార్? ఇంతకు ముందో సినిమా రచయిత/నటుడు ఉండేవాడు – ఇప్పుడు లేడు. ఆయన కాదు కదా.

  • నేను “ఆట” కార్యక్రమంలో కొన్ని ఎపిసోడ్ లు చూసి విరక్తి కలిగి మానేశాను. అందుకు కారణం “విమోచనం” కథలోని మూడవ పారాగ్రాఫ్ లో వ్రాశాను. ఓంకార్ ఎవడు? అతని ఎపిసోడ్ లు నేను చూసినట్టు లేదు. “ఇది కథ కాదు” సీరియల్ లో దామోదరం కారెక్టర్ వేసిన ఓంకారేనా?

 6. ఎవరీ ఓంకార్? ఆ మద్యేప్పుడో చనిపొయాడని విన్నానే.. అతను వెరే ఓంకారా ?.. అదొరకమయిన బొంగురు గొంతుతొ..ఎప్పుడూ వెటకరంగా మాట్లాడుతాడు అతను ఇతను ఒకటేనా.. వాడి డైలాగులు నాకు పరమ ఎలర్జి..
  హింది రియాల్టి షోల కాన్సెప్టే దరిద్రంగా వుంటుందదట.. వాటితొ పొల్చుకుంటే మనం కొద్ది బెటరే అనుకుంటా …

  • చనిపోయిన ఓంకార్ వేరు. ఈ ఓంకార్ వేరు. ఇతను మొదట్లో ఆదిత్యా మ్యూజిక్ చానల్లో కనిపించి నెమ్మదిగా తనే సొంతంగా కార్యక్రమాలు నిర్వహించడం మొదలు పెట్టాడు.

 7. నీ కధ విరోచనం చదివాకా వార్నర్ బ్రదర్స్ కి స్టొరీ కావాలంటే నువ్వు అమ్మడానికి రెడీ ఆ ఎన్ని డాలర్లు కావాలి ఆ కధకు..అంత గొప్పగా వుంది.. చెరసాల కధకోసం వాల్ట్ డిస్నీ వాళ్ళు రేంజ్ లో వుంది ముందు ఆ లింక్ ఇవ్వు

  • కానీ మాటీవీలో ప్రసారమవుతున్న చాలెంజ్ కార్యక్రమం మాత్రం పాశ్చాత్యదేశాల్లో బహుళ ప్రాచుర్యంలో ఉన్న డీల్ ఆర్ నో డీల్ అన్న కార్యక్రమానికి కాపీ. ఇది ఆయన సొంత ఆలోచన కాదు.

 8. అందరి అభిప్రాయాలు చదివా టివి కార్యక్రమాలు చూసి చూసి నేను వేమనలా తయారయ్యాను మా ఇంటిలొ టివి అటక ఎక్కించా
  ఇప్పుడు సమ్మగా ఉంది

వ్యాఖ్యలను మూసివేసారు.