అన్వేషణకి అంతే లేదు…

జపానీయులకు తాజా చేపలంటే ఎంతో మక్కువ. కానీ వారికి దగ్గర్లో ఉన్న నీటి వనరుల్లో కొన్ని దశాబ్దాల నుంచి ఎక్కువగా చేపలు ఉండేవి కావు. ప్రజా అవసరాలను తీర్చడానికి జపాన్ వాసులు పెద్ద పడవలతో దూర తీరాల్లో వెతకడం ప్రారంభించారు. అయితే దూరం పెరిగే కొద్దీ చేపలను తిరిగి తేవడానికి సమయం కూడా ఎక్కువ పడుతోంది. సమయం గడిచే కొద్దీ చేపలు చాలా వరకు చెడిపోయేవి.

చేపలు తాజావి కాకపోవడంతో జపానీయుల జిహ్వకు రుచించేవి కావు. ఈ సమస్యను అధిగమించడానికి పడవల్లో శీతలీకరణ యంత్రాలను అమర్చడం జరిగింది. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా పడవలు ఎక్కువ దూరం వెళ్ళి ఎక్కువ సమయం గడిపి వచ్చేవారు. కానీ జపానీయులకు తాజా చేపలకూ, నిల్వ చేసిన చేపలకూ రుచిలో తేడా తెలిసింది. అందుకనే నిల్వ చేసిన చేపలకు తక్కువ ధర పలికేది. కాబట్టి పడవల్లో చేపల ట్యాంకులు ఏర్పాటు చేయించారు వాటి యజమానులు. అయితే వాటిలో చేపల్ను ఇరుకు గా ఉంచడంతో అవిసరిగా కదిలేవి కావు. దాని వల్ల అవి సగం జీవంతోనే మాత్రమే ఉండేవి. కాబట్టి తినే వారికి ఇంకా రుచిలో తేడా తెలిసేది.

చేపల ధర తక్కువగా ఉండటంతో ఒక విధంగా జపాన్ లో చేపల పరిశ్రమ సంక్షోభంలో పడింది. కానీ ఈ రోజు జపాన్ ఆ సంక్షోభాన్ని ఎదుర్కొని దినదిన ప్రవర్థమానం చెందుతోంది.  ఎలాగో తెలుసా? పడవల్లో నీటి తొట్టెల్లో చేపలతో బాటు ఒక చిన్న షార్క్ చేపను కుడా విడిచిపెట్టేవాళ్ళు. అది కొన్ని చేపలను తినిసేది కానీ, దానికి భయపడి చిన్న చేపలన్నీ అటు ఇటు తిరుగుతూ ఉండేవి. కాబట్టి గమ్యం చేరేవరకు అవి నీళ్ళలోనే ఉన్నట్టుగా తాజాగా ఉండేవి. ధర బాగా పలికింది. పరిశ్రమ అభివృద్ధి బాట పట్టింది.

అందుకనే అంటారు “సాధించిన దానితో సంతృప్తి చెందేవారు జీవితంలో ఎదగలేరు.” అని. సవాళ్ళు మనల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. వాటిని విజయవంతంగా ఎదుర్కొంటే సంతోషం ఎప్పుడూ మనవెంటే.

ప్రకటనలు

24 thoughts on “అన్వేషణకి అంతే లేదు…

 1. sanghatana loni neethi bagane vundi kani, sanghatanee naku nachaledu… swecha ga vunde vatini pattatam enduku? malli shark toh himsinchatam enduku? batiki tajaga vunna vatini ruchi kosam champatam enduku? chi…

  • manchi prasna lalitha garu
   answer”:
   chi chi ilanti prasnalu adige mundu manam telivithetalanu abhinandinchi manam edagadaniki ee incident ni oka example ga teesukunte raasina tanaki chaduvuthunna maanku oka satisfaction

  • @లలిత‌
   హాయిగా పెరుగుతున్న మొక్కలని, నరకడమెందుకు? మనకి మంచిగాలి ఇచ్చి, చెడ్డగాలి పీల్చుకునే తోటకోర, గోంగూర లని చంపి, వేయించి, ఉప్పు కారం వేసి తినడమెందుకు? జీవం ఉంది అని నిరూపితమయిన ఆకుకూరలని, కాయగూరలని బరబరా కోసేయడమెందుకు? తల్లి కి బిడ్డ ఎలాంటిదో, మొక్క కి విత్తనం అలాంటిది (జీవం ఉంది గా మరి). అలాంటి విత్తనాలు కావలసినవాటిని, ప‌ప్పుధాన్యాలని నీళ్ళలో వేసి ఉడకబెట్టి, వాటి పీకనొక్కి భుజించడమెందుకు? స్వేఛ్చ గా తల్లి పాలు తాగే దూడ ని కసాయిగా ఇవతలకి లాగేసి దానికి చెందవలసిన పాలని, వాటి రక్తాన్ని పిండి చేసి మనం జుర్రేయడ‌మెందుకు? లెదర్ చెప్పులు, లెదర్ బ్యాగులు అంటూ గేదెల, ఆవుల చర్మాలని కర్కశంగా ఊడబెరకడమెందుకు?

   వీటికి సమాధానం మీరు చెప్పగలిగితే మీ ప్రశ్న కి సమాధానం దొరుకుతుంది లలితగారు !!!!
   ఎవరి అభిరుచులు వారికి ఉంటాయండీ. ఛీ ఛీ ల ద్వారా వారి మనసు నొప్పించకూడదు కదా.

   పొతే, రవి ఇక్కడ మంచి విషయం చెప్పారు. దానిని మంచి మనసుతో స్వీకరించి, ఆచరిద్దాం.

   • మిమ్మలని నొప్పించకపోవచ్చు, కాని చేపలంటే ఇష్టంగా తినేవాళ్ళన్ని నొప్పించొచ్చుగా !!!
    నన్ను కాదు లెండి, నేను చేపలు అసలు తినను…కాని తినే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు మీ టపా చదవొచ్చుగా !!!! 🙂

   • @యుగంధర్
    అవునా, వెంకి సినిమా లో ఆ డైలాగు ఉందా! నిజంగానే నాకు తెలేదండీ. ఏవో కామెడీ బిట్స్ తప్ప, ఆ సినిమా నేను చూడలేదు.
    అయితే మీరు నాలో భావి రచయిత ని చూసానంటారు 😀

   • అంతే కాదండోయ్ ఇప్పుడు వినయ్ వచ్చి గుడ్ ఫన్ని డిస్కషన్ అని కూడా అనాలే! అప్పుడే నేను మీలో ని వున్న భావి రచయిత్ర ని చూసినట్టు 😀

   • హ హ, వినయ్ వచ్చి “good, funny discussion” అంటారు. అలాగే ప్రవీణ్ శర్మ వచ్చి ఏవేవో మనకు అర్థం కాని (అతనికి మాత్రమే అర్థమయ్యేవి) రాతలు రాస్తాడు. ఆ విధి నుండి మనం తప్పించుకోలేము. మీరు చూస్తూ ఉండండి. త్వరలోనే మీరు నన్ను భావి రచయిత్రిగా ఒప్పుకుంటారు. 🙂

  • హమ్మా నేను లేనప్పుడు చూసి ఇలా తిడతారా మా రవి చంద్ర ని ఎమైన అంటే ఊరుకోనేది లేదు ఏం చేస్తారు అని అడగొద్దు :

   • @సుచిత్ర
    మీరి మీ అభిప్రాయం ఎలా చెప్పరో మేమూ మా అభిప్రాయం అంతే స్వేఛ్చ గా చెప్పాము. ఇందులో మీరు మొదలుపెట్టినది, మేము follow అయినదీ ఏమీ లేదు. రోజు అంతా చెడిపోవడం లాంటి పెద్దమాటలెందుకులెండి.

   • contd….
    మీరు అలా అంటే నాకు భయంగా ఉంది, నారోజేమయిపోతుందో అని. అయినా లలితగారు మంచివారు, మిమ్మలని తిట్టిఉండరు, నన్ను తిట్టుకోరు అని భావిస్తున్నను 🙂

   • ఒక్కసారి కమిట్ అయితే తన మాట తనే వినరు స్టైల్ లో రాసారు కామెంట్..బావుంది నిజంగా లలిత గారు తన మాటే వినరా? 🙂

వ్యాఖ్యలను మూసివేసారు.