ఈ విజయం దేనికి సంకేతం?

మహారాష్ట్ర, అరుణాచల ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. మహారాష్ట్రలో అయితే ఏకంగా కాంగ్రెస్ కూటమి మూడో సారి పగ్గాలు చేపట్టడానికి సమాయత్త మవుతోంది.
ఆడలేక మద్దెల ఓడన్నట్లు ఓడిపోయిన ప్రతివాళ్ళూ (ఈ ఎన్నికల తరువాత బి.జె.పి నాయకుడు ముక్తార్ అబ్బాస్ నక్వీ అంతకు ముందు మన చంద్రబాబు, లెఫ్ట్ పార్టీల వాళ్ళు)ఈవీయం ల మీద పడి ఏడవటం అలవాటైపోయింది. ఎంత రిగ్గింగ్ జరిగినా ఈవీయం లను తమ పార్టీకి మాత్రమే ఓట్లు పడేలా మార్చేస్తే ఎలక్షన్ కమీషన్ చూస్తూ కూర్చునేంతగా బలహీనమైందని నేననుకోను.
ప్రజలు సోనియా గాంధీ నాయకత్వాన్ని సమర్ధిస్తూ ఓట్లు వేస్తున్నారా? లేక ఆ పార్టీ యొక్క ప్రాంతీయ నాయకుల పాలన నచ్చి గెలిపిస్తున్నారా? లేక ప్రతిపక్షాలు వ్యూహంలో వెనుకబడుతున్నాయా అన్నవి నాకు అర్థం కాని ప్రశ్నలు. కానీ వీటిలో ఏ ఒక్కటో కాక అన్నింటి ప్రభావం మాత్రం ఖచ్చితంగా పనిచేసిందనుకుంటాను. కాకలు తీరిన రాజకీయ పండితులే ఓటర్ల నాడిని అంచనా వేయలేకపోతున్నారు. నేనెంత?
అయితే ప్రస్తుతం బి.జె.పి ఎదుర్కొంటూన్న పరిస్థితులను కాంగ్రెస్ కూడా ఒకప్పుడు అనుభవించింది. త్వరలోనే బి.జె.పి కూడా బలపడుతుందని ఆశిద్దాం. బలమైన ప్రతిపక్షం ఉంటేనే కదా అధికార పక్షం కంట్రోల్ లో ఉంటుంది.

ప్రకటనలు

16 thoughts on “ఈ విజయం దేనికి సంకేతం?

 1. పోస్ట్ బావుంది
  బలహీన ప్రతిపక్షం,కాంగ్రెస్స్ లో కంటే మిగతా పార్టీలలో అంతర్గత కలహాలు ఎక్కువ అవడం కూడా ఒక కారణమే

  ఈ విజయం ప్రతిపక్షాల అసమర్ధతకు సంకేతం
  కనీసం వోటర్ ని చైతన్యం చేయడం లో పూర్తిగా విఫలం అయ్యారు అని నా అభిప్రాయం

 2. ఇటీవలి ఎన్నికలలో చాలావరకు అధికారపక్షమే గెలుస్తోంది.
  నా దృష్టిలో ఇదంతా ధనబలమే.
  ప్రతిపక్షంలో కూడా బాగా డబ్బు ఖర్చుచేసినవాళ్ళు మాత్రం గెలుస్తున్నారు.

  • అలాగైతే ఇంతకాలం అధికారాలు ఎలా మారుతున్నాయి? మీరన్నట్లు అది కూడా పనిచేసి ఉండవచ్చు కానీ అధికారంలో ఉన్నపుడు ప్రజా వ్యతిరేకత రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అందులో కాంగ్రెస్ సఫలమైందని చెప్పాలి.

 3. ఈవీఎం రిగ్గింగ్ అంటే ప్రోగ్రామింగ్ మార్చటమే కాదు. అనేక దార్లున్నాయి. 2004లో పోలింగ్ ఆంధ్రాలో పల్లెటూరి వోటర్లకి ఏ మీట ఎలా నొక్కాలో అర్ధమవకపోతే పోలింగ్ ఆఫీసర్లే మీటలు నొక్కేసినట్లు ఆధారాలున్నాయి. (అప్పట్లో జన్మభూమి, శ్రమదానం, ఆకస్మిక తనిఖీలంటూ అదరగొడుతున్న చంద్రబాబుకి వ్యతిరేకంగానే ఆ నొక్కుడు జరిగుంటుందనేదాంట్లో సందేహం లేదు కదా) అందుకే 2009లో పోలింగ్ ఆఫీసర్లు ఈవిఎం సమీపంలోకి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు (సర్వేలెన్స్ కెమెరాలు, etc).

  • ఎన్నికల కమీషన్ నా దృష్టిలో బాగానే పనిచేసిందనే చెబుతున్నా నేను కూడా. కానీ నాయకులు చెబుతున్నంత ఘోరంగా ఏ మీట నొక్కినా కాంగ్రెస్ కే ఓటు పడేలా మార్చేసి ఉంటారన్నది సరైన వాదన కాదనుకుంటా…

 4. “బలమైన ప్రతిపక్షం ఉంటేనే కదా అధికార పక్షం కంట్రోల్ లో ఉంటుంది.” – సరైనమాట చెప్పారు.

  మహారాష్ట్రలో “మహారాష్ట్ర నవనిర్మాణ సేన” ప్రతిపక్షాలకు చేసిన చెరుపు చాలా ఉన్నట్టుంది. అది గెల్చిన సీట్లే 13 దాకా ఉన్నాయి. దానికొచ్చిన వోట్ల శాతాలు తెలిస్తే అది చేసిన చెరుపు పట్ల మరికొంత అవగాహన వస్తుంది. ప్రతిపక్ష వోట్లను చీల్చుకోగల ఎమ్మెన్నెస్ శక్తి, తద్వారా తమకు ఒనగూడే లాభాన్ని బాగా లెక్కేసుకుంది గనకే… రాజ్ థాకరే ఎన్ని ఆగడాలు చేసినా కాంగ్రెసు-ఎన్సీపీ ప్రభుత్వం మాట్టాడకుండా మాగన్నుగా పడుకుని జల్సా చేసుకుంది. ఇప్పుడు విజయంతో జల్సా చేసుకుంటోంది.
  గణాంకాల ప్రకారమే కాకుండా గుణాత్మకంగా ఎమ్మెన్నెస్ చేసిన చెరుపు ఎంతో చెప్పలేం.

  • మనరాష్ట్రంలో చిరంజీవి పోషించిన పాత్ర అక్కడ మహరాష్ట్ర నవనిర్మాణ్ సేన పోషించిందని విశ్లేషకులు అంటున్నారు.

 5. కాంగ్రెస్స్ విజయానికి కారణం … ప్రతిపక్షాల వొట్లు విజయవంతంగా చీల్చడం అనుకుంటున్నా. కాంగ్రెస్స్ కి వున్న స్టాండర్డ్ వొట్ బాంక్ అలాగేవుంది. కాంగ్రెస్స్ వ్యతిరేఖ వొట్లు పంచుకొవడానికి మాత్రం రొజు రొజుకి పార్టిలు పెరిగిపొతున్నయ్.. మన రాస్ట్రం లొ ప్రజారాజ్యం , మహరాష్ట్ర లొ రాజ్ థాక్రె ..
  Its definitely not a good sign 🙂

వ్యాఖ్యలను మూసివేసారు.