అలెగ్జాండర్ మూడు కోరికలు

alexander-l అలెగ్జాండర్ చాలా రాజ్యాలను జయించిన తర్వాత ఇంటికి తిరిగి వెళుతున్నాడు. మార్గమధ్యంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణ శయ్యపై చేరాడు. తాను మరణించడం తథ్యమని అలెగ్జాండర్ కు అవగతమైపోయింది.తాను సాధించిన గొప్ప గొప్ప విజయాలు, అమిత శక్తిశాలురైన  సైన్యం, అంతులేని సంపద తన్ను మరణం నుంచి దూరం చేయలేవని స్పష్టమైపోయింది.

ఇంటికి వెళ్ళాలనే కోరిక తీవ్రతరమైంది. తన తల్లికి కడసారిగా తన ముఖాన్ని చూపించి కన్ను మూయాలనే ఆశ. కానీ సమయం గడిసే కొద్దీ దిగజారుతున్న అతని ఆరోగ్యం అందుకు సహకరించడం లేదు. నిస్సహాయంగా ఆఖరి శ్వాస కోసం ఎదురు చూస్తున్నాడు. తన సైన్యాధికారులను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు.

“నేనింక కొద్దిసేపట్లో ఈ లోకం నుంచి నిష్క్రమించబోతున్నాను. నాకు చివరగా మూడు కోరికలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నెరవేర్చకుండా విస్మరించకండి.” అని వారి నుండి వాగ్ధానం తీసుకున్నాడు.

అశ్రు నయనాలతో కడసారిగా తమ రాజు గారి ఆజ్ఞను వినమ్రంగా అంగీకరించారు ఆ అధికారులు.

నా మొదటి కోరిక:  ” నా శవ పేటికను కేవలం నా వైద్యులు మాత్రమే మోయాలి”

రెండవ కోరిక: “నా పార్థివ దేహం  స్మశానానికి వెళ్ళే దారిలో నేను సంపాదించిన విలువైన వజ్రాలు, మణి మాణిక్యాలు పరచండి”

మూడవ కోరిక: “శవపేటిక లో నుంచి నా ఖాళీ చేతులు బయటికి కనిపించే విధంగా ఉంచండి”

చుట్టూ మూగి ఉన్న సైనికులు ఆయన విచిత్రమైన కోరికలు విని ఆశ్చర్యపోయారు.కానీ వారిలో ఎవ్వరికీ ఆయన్ను అడిగే ధైర్యం లేకపోయింది. అలెగ్జాండర్ కు అత్యంత ప్రీతి పాత్రుడైన ఒక సైనికుడు దగ్గరగా  వచ్చి, ఆయన చేతులను ముద్దాడి, ఆయన కోరికలను తప్పక నెరవేరుస్తామని మాట ఇచ్చాడు. ఈ కోరికల వెనక ఆంతర్యమేమిటో సెలవియ్యమని అడిగాడు.

అలెగ్జాండర్ అతి కష్టమ్మీద ఇలా అన్నాడు. “ఈ మూడు కోరికలు నేనిప్పుడే నేర్చుకున్న మూడు పాఠాలకు ప్రతిరూపాలు.”

“మొదటి కోరికలో నా ఆంతర్యం, నిజానికి ఏ వైద్యుడూ మరణాన్ని ఆపలేడు . ఒకవేళ  వైద్యం చేసినా వల్లకాటి వరకే.” అని చెప్పడానికి.

“రెండవ కోరికలో నా ఆంతర్యం, నా జీవితంలో సింహ భాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది.అదేదీ నా వెంట తీసుకెళ్ళలేక పోతున్నాననీ, కేవలం సిరిసంపదల వెంటబడి విలువైన సమయాన్ని, జీవితంలో మాధుర్యం కోల్పోవద్దని చెప్పడానికి”

“మూడవ కోరికలో నా ఆంతర్యం ఈ ప్రపంచంలోకి నేను వచ్చేటపుడు వట్టి చేతులతో వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే ”

అని చెప్పి కన్ను మూశాడు.

అలెగ్జాండర్ రాజ్యకాంక్ష గల చక్రవర్తే కావచ్చు. కానీ ఆయన గురించిన ఈ సంఘటనలో భారతీయ ఆత్మ ఉంది. ఆధ్యాత్మిక సారం ఉంది. అందుకనే ఈ సంఘటన అంటే నాకు ఎంతో ఇష్టం.

37 thoughts on “అలెగ్జాండర్ మూడు కోరికలు

 1. నేను కూడా చిన్నప్పుడు చదివాను కానీ మూడవ కోరిక గురించి మాత్రమే చదివాను.

 2. మంచి టపా. అలెగ్జాండర్ కధ గురించి తెలుసు గానీ. ఈ కోరికల గురించి తెలియదు. ధన్యవాదాలు.

  // కానీ ఆయన గురించిన ఈ సంఘటనలో భారతీయ ఆత్మ ఉంది. ఆధ్యాత్మిక సారం ఉంది.

  నిజం.

 3. మంచి నీతి కథ చెప్పి, చివర్లో భారతీయ ఆత్మ గొప్ప అన్నట్టు చెప్పడం నాకు నచ్చలేదు. మనుషులంతా ఒకటే, ఆధ్యాత్మిక ధోరణి ఒక్క భారతీయులలోనే వుండదు. good and bad exists every where. except that small word, nice story.

  • అలెగ్జాండర్ కు ఈ విషయాలు తెలియవచ్చింది ఒక భారతీయ ఋషి వల్ల అని మీకు తెలియకపోవడం వల్ల అలా అనిపిస్తుంది. భారతీయ ఆత్మ అన్నది కథలో ఉన్నది అని నా అభిప్రాయం. ఇప్పటి దాకా నేను చదివిన పాశ్చాత్య దేశపు కథల్లో సెంటిమెంట్, భౌతిక పరమైన అంశాలు ఎక్కువగా ప్రస్తావించబడి ఉంటాయి కానీ ఇలా ఆత్మలు, దేహం అంటూ మాట్లాడరు. any way thanks for the comments.

  • అప్పట్లో పెద్దగా టీవీ చూసేవాణ్ణి కాదు. మా ఊర్లో ఒకే టీవీ ఉండేది. కానీ ఒకటి రెండు ఎపిసోడ్లు చూసినట్లు గుర్తు.

 4. అలెగ్జాండర్ గురించి గొప్పగా చెప్పారు…
  ఈ వాఖ్యానం చదివినంతనే…
  ఏదో కొత్త విద్యుత్ శక్తి ప్రవహించినట్టుంది…

 5. Alexander came to know the great & best answers in his life… for what purpose he had earned (get) all things..nothing will come with us.. when we die.. but today people are unable to know (this truth)what they are doing, or for what purpose they running after many things… as i have come to know.. i request you all to realize this truth.and make every effort best..as you can enjoy your life upon this earth within your short span of life….(don’t run after the things which you can’t get… but pursue those things which you require..)

 6. satish . అలెగ్జాండర్ కధ గురించి తెలుసు గానీ. ఈ కోరికల గురించి తెలియదు

  satish123456@gmail

వ్యాఖ్యలను మూసివేసారు.