తుది పలుకులు

పున్నారావు తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నాడు. బంధువులంతా చుట్టూ చేరారు. పక్కనే ఉన్న స్నేహితుడికి సైగ చేసి ఒక పెన్నూ పేపర్ తెమ్మన్నాడు. సరే ఏదో చివరి కోరిక నోటితో చెప్పలేక రాసి చూపిస్తాడని తెచ్చి ఇచ్చారు. అతి కష్టమ్మీద రెండు వాక్యాలు రాసి ప్రాణాలు విడిచాడు పున్నారావు.
సరే చనిపోయిన వెంటనే దాన్ని చదవడం ఎందుకని మడిచి జేబులో పెట్టుకున్నాడా స్నేహితుడు. దహన కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత ఆయన ఇంటికొచ్చి అందులో ఏం రాశాడో చదవాలని కుతూహలం కలిగింది. మడత విప్పి చూశాడు. అందులో
“నా తల దగ్గర కూర్చున్నాయన నా ఆక్సిజన్ ట్యూబ్ పై కూర్చున్నాడు. నాకు ఊపిరి ఆడటం లేదు” అని రాసి ఉంది.

ప్రకటనలు

5 thoughts on “తుది పలుకులు

  1. అంత కష్ట పది రాసే బదులు ఆ పెన్ తో వాడిని పొడిచేయొచ్చు కదా! పైగా తల దగ్గరే కూర్చున్నాడు అన్నారు ఆ పాలి తో ఒకటి గుచ్చితే సరి

  2. క్షమించాలి రవి చంద్ర గారు మేము పోస్ట్ లు రాయం రాసిన వాళ్ళని ఇలా ఏవో ప్రశ్నలు వేసి బాధ పెట్టడం సబబు గా లేదు అనిపిస్తోంది మీ బ్లాగ్ కి వచ్చినా ఇంక కామెంటం

    • అయ్యో ఎంతమాటన్నారండీ! మేం రాయాలి. మీరు ప్రశ్నలడగాలి. అప్పుడే కదా మజా ఉంటుంది. 🙂
      🙂

వ్యాఖ్యలను మూసివేసారు.