అంథుడి కోరిక

ఒక గ్రామంలో ఒక అంథుడు నివసించేవాడు. కటిక దారిద్ర్యంతో బాధపడేవాడు. పెళ్ళైంది కానీ పిల్లల్లేరు. ఇలా ఒక దానిని మించి ఒకటి కష్టాలతో విసిగి వేసారి పోయి చివరికి దేవుణ్ణి తన కష్టాలు తీర్చమని వేడుకున్నాడు.
అతని దీనస్థితి గురించి తెలుసుకుని దేవుడు అతని ఎదుట ప్రత్యక్షమైనాడు.
“నీ బాధలు తీర్చడానికే వచ్చాను. ఏం కావాలో కోరుకో! అయితే ఒకే ఒక షరతు. నువ్వు కేవలం ఒక్క వరం మాత్రమే కోరుకోవాల్సి ఉంటుంది” అన్నాడు.

ఆ అంథుడు బాగా ఆలోచించి ఈ విధంగా కోరుకున్నాడు.
” నా కుమారుడు బంగారు ఊయలలో ఊగుతుంటే చూడాలని ఉంది స్వామీ” అన్నాడు.
“తథాస్తు” అని మాయమయ్యాడు భగవంతుడు.
ఒక్క కోరిక తో ఆ అంథుడు ఎన్ని వరాలు పొందాడో చెప్పుకోండి చూద్దాం?

8 thoughts on “అంథుడి కోరిక

 1. కటిక దరిద్రం లో కూడా తిండి లేకపోయినా కూడా పెళ్ళాం కావాలా?

  దేవుడు వెంటనే ఆటను చూస్తుండగానే అతని కడుపులో నుండి బిడ్డని తీసి ఒక లైట్ వెయిట్ బంగారు ఉయ్యాల ఇస్తే ???

 2. అవును మూడే; కుమరుడు పుట్టాలని, బంగారు ఊయల చేయించగ‌ల డబ్బు కావలని, కుమారుడిని చూడడానికి కళ్ళు రావాలని !!!

  • కాదు!.. నాలుగు కోరికలు

   పెళ్ళాం తో సంసారం చేయాలని
   సంసారం చేయడానికి శక్తి రావాలని
   రెండూ రావాలంటే డబ్బు రావాలని
   సంసారం చేసి కొడుకు పుట్టాలని
   శక్తి డబ్బూ వున్నా సంసారం చెయ్యాలంటే కళ్ళు రావాలని
   పుట్టిన బిడ్డ కి బంగారు ఉయ్యాలలో ఆడించాలని (సంపద) రావాలని

 3. కాదు!.. నాలుగు కోరికలు

  పెళ్ళాం తో సంసారం చేయాలని
  సంసారం చేయడానికి శక్తి రావాలని
  రెండూ రావాలంటే డబ్బు రావాలని
  సంసారం చేసి కొడుకు పుట్టాలని
  పుట్టిన బిడ్డ కి బంగారు ఉయ్యాలలో ఆడించాలని (సంపద) రావాలని

వ్యాఖ్యలను మూసివేసారు.