దున్నేదెవరు?

అమెరికా లో ఒక ముసలాయన ఒంటరిగా నివసిస్తుండే వాడు. ఆయన కుమారుడు హత్యా నేరం కింద జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయన పొలంలో బంగాళాదుంపలు సాగు చేయాలంటే బాగా దున్నాలి. పాపం దున్నాలంటే సాయం అవసరమైంది. దాంతో జైల్లో ఉన్న కొడుక్కి ఒక ఉత్తరం రాశాడు. దాని సారాంశం

బాబూ!
ఈ సంవత్సరం నువ్వు లేకపోవడంతో నేను పొలం సాగుచెయ్యలేక పోతున్నాను. వయసై పోవడంతో పొలం దున్నలేకున్నాను.నువ్వుంటే బావుండేది.అంతా పని నువ్వే చూసుకునేవాడివి.

ప్రేమతో
మీ నాన్న

దానికి అటువైపు నుండి ఈ విధంగా సమాధానం వచ్చింది.
“నాన్నా! దయచేసి ఆ భూమిని మాత్రం దున్నకండి ఎందుకంటే నేను చంపిన శవాలన్నీ అక్కడే పూడ్చిపెట్టాను” అని
మరుసటి రోజు తెలవారక ముందే ఎఫ్‌బీఇ వాళ్ళు ఒక పటాలం దిగి పొలాన్నంతా పలుగు, పారలతో తవ్వి పడేశారు. ఏమీ కనిపించకపోవడంతో పెద్దాయనకి క్షమాపణలు చెప్పి వెళ్ళిపోయారు.

ప్రకటనలు

6 thoughts on “దున్నేదెవరు?

  1. Continuation:

    ఆ మరుసటి రోజు తండ్రికి మరో ఉత్తరం వస్తుంది .. “నాన్నా! ఇంక బంగాళాదుంపల సాగు మొదలు పెట్టుకో. జైల్లో ఉండి నీకు నేను చెయ్యగలిగిన సాయం ఇదే!”

    • నాకెందుకో అక్కడ దాకా నిలిపేస్తేనే బాగనిపించింది.అందుకనే నిలిపేశా…:-)

  2. ఇంత మంచి టపా మిస్ అయ్యాను ఇది చదివిన తరువాత మనసు చాలా బాదగా ఉంది అక్కడితొ ఆపివెయడమ్ చాలా బాగుంది ఒక షాక్ లా ఉంది

వ్యాఖ్యలను మూసివేసారు.