మళ్ళీ జరగదు…

ఒకాయనకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. జైల్లో కొద్ది రోజులు ఉండే సరికి ఆయనికి విసుగొచ్చింది.దగ్గర్లో ఉన్న ఒక చీమను పట్టుకుని దానికి కొన్ని ట్రిక్స్ నేర్పించాలనుకున్నాడు. ఎగరడం, దొర్లడం,పిల్లిమొగ్గలేయడం లాంటివి. అన్ని సంవత్సరాలపాటు శిక్షణ ఇచ్చి దాన్ని ఎలా చెబితే అలా చేసేలా తయారు చేశాడు.

జైలు శిక్ష పూర్తయిన తర్వాత దాన్ని ఒక అగ్గిపెట్టెలో పెట్టుకొని బయటకు వచ్చాడు. బార్ లోకి వెళ్ళాడు. ఒక దగ్గర కూర్చుని అగ్గిపెట్టె లోనుంచి చీమను బయటకు వదిలాడు. పక్కనున్న అతనితో “ఇప్పుడు ఈ చీమ నేను ఎలా చెబితే అలా చేస్తుంది. చూడు” అన్నాడు.

అతను ఆశ్చర్యపోతూ “ఏదీ చూపించండి?” అన్నాడు.

జైల్లో తను ఆ చీమకు నేర్పించిన ట్రిక్కులన్నీ చూపించాడు. అవతలి వ్యక్తి సంభ్రమంగా “దీంతో నువ్వు చాలా డబ్బు సంపాదించవచ్చు. నీ పంట పండినట్లే ” అన్నాడు.

దాంతో ఉబ్బి తబ్బిబ్బయిపోయి మన హీరో పక్కనే ఉన్న బేరర్ ని పిలిచి ” ఏమోయ్ ఈ చీమను చూశావా?” అన్నాడు.

వాడు వెంటనే దగ్గరికి వచ్చి ఆ చీమను చేత్తో నలిపేసి. ” సారీ సర్ ఇంకెప్పుడూ అలా జరగదు.” అని చెప్పేసి వెళ్ళిపోయాడు.

గమనిక: జోకుల్లో తర్కం(లాజిక్)  కోసం వెతకద్దు. నచ్చితే మనసారా నవ్వుకోండి. ఇదేమీ నిజంగా జరిగింది కాదు. 🙂

ప్రకటనలు

16 thoughts on “మళ్ళీ జరగదు…

  1. ఇక్కడ చీమ అన్ని ఫీట్ లు చేస్తే ఎలా డబ్బులు వస్తాయి ఎవరికీ కనపడదు కదా ..
    అంత మంచి నైపుణ్యం కలిగిన వాడె అయితే మరో వంద చీమలకు మళ్ళీ ట్రైనింగ్ మొదలెట్టొచ్చుగా 😀

  2. జోకుకు లాజిక్ ఉండదు. చీమ పాయింటుతోనే ఆ మధ్య జయప్రకాష్ రెడ్డి కామెడీ సీను ప్రోమోల్లో కనిపించింది. విజువల్ లో బాగా అనిపించింది.

    • hmm చీమక్కూడా అపకారం తలపెట్టినట్లు చెప్పినా తట్టుకోలేని మనసన్న మాట మీది. great…
      Different people different reactions…

వ్యాఖ్యలను మూసివేసారు.