వ్యాపారం వ్యాపారమే… :-)

గుజరాతీయులు వ్యాపారం చేయడంలో సిద్ధహస్తులు. వాళ్ళను గురించి ప్రాచుర్యంలో ఉన్న ఒక జోక్.

చాలా ఏళ్ళ క్రిందట సౌత్ లండన్ లో ఒక స్కూల్లో ఇంచుమించు ఐదు సంవత్సరాలు వయసుండే పిల్లలకు ఒక టీచర్ పాఠాలు చెబుతోంది.

మధ్యలో పిల్లలందర్నీ ఒక ప్రశ్న అడిగింది. ” ఈ భూమ్మీద ఇప్పటి దాకా నివసించిన వాళ్ళలో గొప్ప వాడెవరు? ఈ ప్రశ్నకు కనుక మీలో ఎవరైనా సమాధానం చెబితే మీకు ఇరవై పౌండ్లు ఒక చాక్లెట్ ఇస్తానని ప్రకటించింది.

ఒకబ్బాయి లేచి “సెయింట్ పాట్రిక్” అన్నాడు. “కాదు” అంది టీచర్.

ఇంకొకబ్బాయి లేచి “సెయింట్ ఆండ్రూ” అన్నాడు. దానికీ ఒప్పుకోలేదు టీచర్.

చివరికి ఒక గుజరాత్ అబ్బాయి లేచి “జీసస్ క్రైస్ట్” అన్నాడు.

“అబ్సల్యూట్ లీ రైట్! ఇంద తీసుకో ఇరవై పౌండ్లు, చాక్లెట్ ” అంటూ దగ్గరికి పిలిచి ఇలా అడిగింది.

“నువ్వు గుజరాతీ కదా. జీసస్ క్రైస్ట్ అని ఎందుకు చెప్పావు?”

“నాకు తెలుసు శ్రీకృష్ణుడని! కానీ వ్యాపారం వ్యాపారమే!” 🙂

13 thoughts on “వ్యాపారం వ్యాపారమే… :-)

    • వ్యాపారస్తులకు బిజినెస్ లో సెంటిమెంట్లుండవు. వాళ్ళకు కావలసింది లాభం.
      గుజరాతీయులు వ్యాపారం నిర్వహించడంలో సిద్ధహస్తులు.

  1. రవిచంద్ర గారు అంతర్వాహిని అంటే ఏంటి వివరించండి ..అలాగే అదే చేత్తో ఈరోజు పోస్ట్ కూడా రాసేయండి ..బావుంది మీ బ్లాగ్

    • పెద్ద గూఢార్థం ఏమీ లేదండీ, మనసులో (అంత:=లోలోపల) ఎడతెరిపిలేని ఆలోచనల (వాహిని=) ప్రవాహం అనే అర్థం వచ్చేటట్లుగా పెట్టుకున్నానంతే… 🙂

వ్యాఖ్యలను మూసివేసారు.