సర్దార్జీనా మజాకా?

రోల్స్ రాయిస్ కారు
రోల్స్ రాయిస్ కారు

కారంటే తెలిసిన వారు రోల్స్ రాయిస్ అనే పేరు వినే ఉంటారు. దానికున్న దర్జా, దర్పం, హుందాతనం జగద్విదితం. 1930 లో  పంజాబ్ మహారాజు భూపిందర్ సింగ్ కొంతమంది అనుచరులను రోల్స్ రాయిస్ కొత్తగా విడుదల చేసిన మోడల్ కారును కొని తెమ్మని పంపించాడు. మరి వీళ్ళ వేష భాషలు చూసి సదరు కంపెనీ వాళ్ళు ఏమనుకున్నారో ఏమో! రాజావారి విజ్ఞప్తిని తిరస్కరించారట.

విషయం తెలుసుకున్న రాజాగారికి ఒళ్ళు మండింది. అంతే!తన దగ్గర మూలన పడి ఉన్న పాత రోల్స్ రాయిస్ కార్లతో పాటియాలా నగరంలో చెత్తను ఎత్తమని పురమాయించాడు. ఇది రోల్స్ రాయిస్ ను ఎంతో అభిమానించే వైస్రాయ్ కు అవమానంగా తోచింది. వెంటనే రోల్స్ రాయిస్ కంపెనీ కి ఈ విషయాన్ని తెలియజేసి సాధ్యమైనంత త్వరగా రాజావారి కోరికను మన్నించాల్సిందిగా వారిని ఒప్పించారట. అంతే కాదు ఆయన లండన్ వెళ్ళినపుడు పది బ్రహ్మాండమైన రోల్స్ రాయిస్ కార్లతో ర్యాలీ ఏర్పాటు చేసి ఊరేగించారట.

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా?