ముఖ్యమంత్రి కనపడుట లేదు

కర్నూలు నుంచి చిత్తూరుకు వెళుతున్న ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ సాంకేతిక కారణాల వల్ల కనిపించకుండా పోయింది. మధ్యాహ్నం వరకూ వార్తల్లో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయిందని చెబుతున్నా ఖచ్చితమైన సమాచారం తెలియరావడం లేదు. మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం నేత చిరంజీవి మీడియా కాన్ఫరెన్స్ ద్వారా తమ సంఘీభావం ప్రకటించారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.
నాకు ఎంతో ఇష్టమైన ముఖ్యమంత్రి ఈ విపత్తు నుండి క్షేమంగా బయటపడాలని మనసారా కోరుకుంటున్నాను.

ప్రకటనలు

12 thoughts on “ముఖ్యమంత్రి కనపడుట లేదు

  1. యై ఎస్ గారు మనకు నచ్చినా నచ్చకపోయినా విషాద సమయంలో పరిహాసం చేయడమా?! హ్మ్మ్. కాస్త మానవత్వం కూడా వుండాలి మనకి. క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను.

  2. ముఖ్యమంత్రిగా ఆయన ఎలాంటి వాడన్నది పక్కన పెట్టండి. సాటి మనిషిగా చూడలేమా? ఆయన క్షేమంగా తిరిగి రావాలని కొరుకుంటున్నాను. ఆయన తిరిగి రాకపోతే ఇబ్బందుల్లో పడేది సామాన్య ప్రజలే! దొమ్మీలు, లూటీలు, దేనికి అవకాశం లేదు? పైగా రేపు నిమజ్జనం కూడా ఉంది సిటీలో! అది ఆపడానికి లేదు చివరి రోజు కాబట్టి! ఎలాంటి గొడవలు జరుగుతాయో!

  3. hmmm …nenu ee news telisi 2 hrs avuthundi …news chk chesanu …blogs choosanu …enduku …nakemi YSR safe ga undali ani sentiment ledu …humanity antaremo ..Satyam rama linga raju bagundali anukone danni …humanity kaadu appudu …he created jobs …and so many doing frauds …and he could not hide it …and satyam company baagundali anukonnanu …

    ippudu same feelings CM kosam ravatam ledu …asalu YSR acting kavachu leda YSR padavi pai interest unna congress vallu, leka TDP vallu yemaina chesi undochu anukonnanu …yedaina tappu patta lenu … yevari godava vaaridi ….there is a big political bubble ..adhikaara party, prathi paksham ani ledu ..yevari stayi lo interests vaariki unnayi …every one spent money to win …mostly ..I wish YSR only playing this ..so that he can be safe ….

  4. YSR elantivadaina (politics lo almost antha oka rakam gane vuntaru) kshemam ga vundali ani aasistunnanu. Kani andulo ayana toh batu vunna Sr IAS officer and security officer, pilot la kutumbala paristhithi ento… entha experience, telivi, hardwork leka pothe vaaru aa sthananiki vachi vuntaru… mukhyam ga vaaru kshemam ga ee aapada nunchi bayata padali ani manasaraa korukuntunnanu… Andunaa IAS officer gaari gurinchi telisaka, vaari inti paristhithi telisaka inka badha ga vundi…

  5. రవిచంద్ర గారు, అయాం వెరీ సారీ! మీ ప్రియతమ నాయకుడు దక్కకుండా, చేసిన సేవలు చాలనుకున్నాడేమో, తిరిగిరాని లోకాలకు, వెనుకకు తిరిగి చూడకుండా చాలా తొందరపడి, ఎవరికీ చెప్పకుండానే వెళ్ళిపోయాడు. బహుశ పైలోకల్లోనే ఈయన అవుసరం చాలా ఉందేమో!

వ్యాఖ్యలను మూసివేసారు.