ఈ రోజు… నా పుట్టిన రోజు

చిన్నప్పుడెప్పుడో మా అమ్మ నాకు పుట్టిన రోజు చేసినట్లు గుర్తు. ఊర్లో ముత్తైదువులందర్నీ పిలిచి వాళ్ళచే నాపైన అక్షింతలు చల్లించేది.
“నా ఆయుష్షు కూడా పోసుకుని నిండు నూరేళ్ళు బ్రతకరా చిన్నా!” అని వచ్చిన వాళ్ళు దీవిస్తుంటే అమ్మ మనసు ఎంత పులకించిపోయేదో. ఆ కళ్ళలో ఎన్ని వెలుగులో.
అసలు మా ఊర్లో పుట్టిన రోజుల పండగలంటూ ప్రారంభించింది మా అమ్మేనని నాకు తర్వాత చెప్పింది అమ్మ. అప్పట్లో అంత వెనకబడ్డ ఊరు మాది. ఇప్పుడైతే ఇంటికొక కేబుల్ కనెక్షన్ వచ్చేసిందనుకోండి! సినిమాలు, సీరియళ్ళు తెగ చూసేసి అన్నీ నేర్చేసుకుంటున్నారు జనాలు.
కొంచెం పెద్ద వయసు వచ్చాక పుట్టిన రోజు పండగ జరుపుకోవడం నెమ్మదిగా ఆగిపోయింది.
ఇంక కాలేజీకి వచ్చిన తర్వాత స్నేహితులు ఎవరైనా పార్టీ అడుగుతారని వారికి చెప్పకుండా దాచేసే వాణ్ణి. ఏం చేద్దాం? మనకి పాకెట్ మనీకి డబ్బులుండవు. ఇంట్లో అడిగితే ఇవ్వరని కాదు. వాళ్ళ కష్టాలు వాళ్ళు పడి ఎలాగోలా ఇస్తారు. ఎందుకంటే నేను ఎంతో అవసరమైన ఖర్చుకు తప్ప వాళ్ళను అడగనని వాళ్ళ ప్రగాఢ విశ్వాసం. వాళ్ళను కష్టపెట్టటం నాకు ఇష్టం ఉండేది కాదు. కొత్త బట్టలు కూడా మా నాన్నే తెచ్చిచ్చేవాడు.
ఇప్పుడు కంపెనీలో టీమ్‌మేట్స్ సమక్షంలో పుట్టిన రోజుల పరంపర మళ్ళీ మొదలైంది.
********************************************
ఈ పోస్టుకి ప్రేరణ మా ఎంటెక్ క్లాస్‌మేట్ వేణు. వాడి పుట్టిన రోజు ఎవరైనా హ్యాపీ బర్త్‌డే చెప్పకపోతే వాడే విష్ మి హ్యాపీ బర్త్ డే అనే వాడు. ఇంక వాళ్ళు సిగ్గుపడి హ్యాపీ బర్త్ డే అని చెప్పేసేవారు వాడి గడుగ్గాయి తనానికి అబ్బుర పడిపోతూ 🙂

17 thoughts on “ఈ రోజు… నా పుట్టిన రోజు

  1. ‘ పుట్టినరోజు జేజేలు చిట్టిపాపాయి, నీకు ఏటేట ఇలాగే పండగ జరగాలి ‘.
    ‘బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు, ఏ దేశమే జాతి, ఎవ్వరింటిది పాప అనిఎల్లరడగాలి మా పేరు నిలపాలి,ఘన కీర్తి తేవాలి,’ ఈ పాట చిన్నప్పుడు ప్రతి పుట్టినరోజుకి మా అమ్మ పాడేది.

వ్యాఖ్యలను మూసివేసారు.