పిచ్చి తగ్గినట్లు ఎలా తెలుసుకోవాలి?

ఆరోగ్య శాఖామంత్రి ఒకసారి పిచ్చాసుపత్రిని సందర్శించడానికి వెళ్ళాడు. మాటల మధ్యలో ఒక డాక్టర్ని అడిగాడు.
“ఏమయ్యా! ఒక పేషెంట్ కి పిచ్చి తగ్గిందని మీరు ఎలా పరీక్షిస్తారు?”
“దానికో పరీక్ష ఉంది. అదేంటంటే వాళ్ళని నీళ్ళతో నింపిన ఒక స్నానపు తొట్టె (బాత్ టబ్) దగ్గరకు తీసుకెళతాం. వాళ్ళకి ఒక కప్, ఒక స్పూన్ ఇచ్చి తొట్టెలోని నీళ్ళన్నీ బయటికి తోడమంటాం…”
“హా అర్థమైంది.. అర్థమైంది… అంటే పిచ్చి తగ్గినవాడు కప్పు పెద్దది కాబట్టి దానితో నీళ్ళని తోడిపోస్తాడన్నమాట”
“కాదు సర్. మామూలు మనిషి సింపుల్ గా తొట్టె అడుగు భాగాన ఉన్న పైపును ఊడతీసేస్తాడు”

ప్రకటనలు