బట్లర్ ఇంగ్లీషు గిలిగింతలు

ఒక మిత్రుడు మరో మిత్రుడితో “నీకు ఇంగ్లీషు స్పీకింగ్ కమింగా”
“నీ ఇంగ్లీషు విన్న తర్వాత ఇప్పుడిప్పుడే గోయింగ్”
******************************************
కొడుకు తండ్రితో…”నాన్నా కాక్ ఈజ్ గోయింగూ”
“గోయింగా అయితే పట్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ గంప”
******************************************
ఇది మా ఇంజనీరింగ్ కాలేజీలో నిజంగా జరిగింది.
ఇద్దరు స్టూడెంట్స్ గొడవలు పడి మా కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ దగ్గరకు వెళ్ళారు. ఒకడు ఆయనతో మాట్లాడుతుంటే మరొకడు మద్యలో అడ్డుపడుతున్నాడు.
ఆయన కోపంతో ఇలా అన్నాడు.
“he talks, me talks , why you talk middle middle”
ఇక మా స్నేహితుల మద్య ఎలాంటి గొడవలున్నా సరే ఎవరైనా సరే పై మాటలు అన్నారంటే వాతావరణమంతా తేలికైపోయి హాయిగా నవ్వుకుంటాం. భలే ఉంది కదూ

16 thoughts on “బట్లర్ ఇంగ్లీషు గిలిగింతలు

 1. hahahhahaha………..
  hey maa m.tech friend cheppevaadu valla faculty ila okatanu vundevadanta B.tech lo .atanu okasaari oka student bayata tirugutunate…..y u under stand tree annadanta….

  ilane chaala cheppadu gurtuleavu…….gaani excellent ………..

 2. మా కాలేజీలో కూడా ఇలాంటి వాళ్లు చాలా మంది ఉండేవారు, ఒకసారి ఒకతన్ని క్లాసుకి ఎందుకు ఆలస్యంగా వచ్చావని అడిగితే బస్సు లేటయిందని చెప్పాడు, దానికి లెక్చరర్ “come before bus” అని సెలవిచ్చాడు.
  ఇప్పుడు ఆ లెక్చరరే కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాడు

 3. మా ఫిజిక్స్ లెక్చరర్ మీద ఒక జోక్ ప్రాచుర్యంలో ఉండేది. ఆయన లెక్చరరైన కొత్తలో – ఇంగ్లిష్ సరిగా రాక – వింతగా మాట్లాడేవాడట. ‘ప్రిన్సిపాల్ వరండాలో పచార్లు చేస్తున్నాడు’ అనేది ఆయన స్టైల్లో: ‘the principal is oscillating in the verandah’ 🙂

  అలాగే, ‘ఎవరి పుస్తకాలు వాళ్లు తీసుకోండి’ అనటానికి ‘whose whose books, those those take’.

 4. మాకు fortran language teach చేసినాయన, ఈ బాపతే. మా క్లాస్ లో ఇద్దరే అమ్మయలు ఉండేవారు (ఆ రోజులలో అమ్మాయలే లేని engineering classrooms ఎక్కువ ఉండేవి). ఓ రోజు, వాళ్లిద్దరూ ఎందుకనో ఈయన క్లాస్ కు డుమ్మా కొడితే తరువాత రోజు క్లాస్ లో ఆయన you and you, why not came my class yesterday అని అడగటం చూసి, ఇప్పటికీ అది తలచుకొని నవ్వుకొంటాం.

  కొసమెరుపు, అతిత్వరలోనే ప్రస్తుతం ఓ university లో చక్రం తిప్పుతున్న ఆయన, vice chancelor పదవికి tender వేసి ఉంచాడు అని.

 5. hillarious jokes….ఇలాంటివి మా university లో తెగ జరిగేవి.
  ఒకసారి మా ప్రొఫెసర్, క్లాస్ లో హాజరు తీసుకున్నాక అన్నారూ….”everybody is present except those are absent” అని.

  ముఖ్యంగా ఒరియా వాళ్ళకి english సరిగ్గా రాదు. వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. వాళ్ళకి వచ్చిందే భాష అనుకుంటారు. వాళ్ళు ‘స’ ని ‘ష’ గాను, ‘ష’ ని ‘స’ గాను పలుకుతూంటారు. ఒకసారి, ఒక తెలుగబ్బా యి, ఒక ఒరియా అబ్బాయి ని wish you happy new year అని wish చేస్తే shame to you అన్నాడు. కాని అక్కడ ఆ అబ్బాయి పాపం ‘same to you’ అనే అన్నాడు. కాని మనకి అది ఇంకోలా వినిపించింది అంతే. అలగే ఇంకో ఒరియా అమ్మయి అన్నది….all boys are shitting in line’…. దీని తాత్పర్యం ఏమిటంటే ‘all boys are sitting in line’ అని. ఇలా వాళ్ళా స లు, ష లు విని తెగ నవ్వుకునేవాళ్ళం. చెప్పాలంటే ఇంకా బోలెడు ఉన్నాయి ఇలాంటివి.

  ఇంకోసారి, ఇంకో అమ్మాయి మధ్యాహ్నం భోజనానికి salad తయారు చేసింది. ఇద్దరం కలిసి భోజనానికి వెళ్దాం అనుకున్నాం, ఇంతలో ఆ అమ్మయికి ఏదో phone వచ్చింది. నేను తరువాత తింటాను, నువ్వు కావలసినంత salad తీసుకో అని చెప్పడానికి….’ i will eat later, you take salad as if you want ‘ అంది. అంతే పట్టాపగ్గాలు లెకుండా నవ్వాను. ఆ అమ్మాయి ముందు కాదులెండి.

  ఇలాంటివి ఇంకా కోకొల్లలు.

 6. మాకు ఇంజనీరింగ్ లో కెమిస్ట్రీ లెక్చరర్ ఒకాయన ఉండేవాడు..ఇంగ్లీష్ లో కిలోమీటర్ వీక్. ఒక సారి ఇటుక ని ఇంగ్లీష్ లో ఏమంటారు అనేది ఆయనకి ఫ్లో లో గుర్తురాలేదనుకుంటా…”suppose there are two ఇటుక్స్” అన్నాడు..పోన్లే అని క్షమించేసారు స్టుడెంట్స్..ఇంకోసారి “if today is tomorrow, there is no tomorrow” అన్నాడు. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. కాకపోతే క్లాస్ లో ఒక డికోడర్ ఉండేవాడు..వాడు చెప్పాడు..”అరె, ఆయన ఉద్దేశ్యమేమంటే..రేపు కూడా ఈరోజు లాగే వర్షం పడితే రేపు క్లాస్ ఉండదు” అని..ఈ ముక్క లో ఇంత మీనింగ్ ఉందేటి అనుకుని, ఆయని వెళ్ళి అడిగాం “రేపు క్లాస్ ఉంటుందా” అని. “చెప్పాను కదండీ క్లాస్ లో నే. if today is tomorrow, there is no tomorrow అని. రేపు కూడా వర్షం పడిందంటే క్లాస్ ఉండదు”
  😀

 7. inka nayyam….
  ma collage lo ayite, lecturer vacchi poye vallani uddesistuu..
  “coming are cominge comingu, going are goinge goingu ….
  ani annadu. ika chuskondi …. maa navvulaki pattapaggalu levu..

 8. నిన్న, నేను ఒక‌ 5 star hotel లో, ఒక పెద్ద conference, attend అయ్యాను. అందులో ఒక ప్రొఫెసర్ paper present చేసారు. అందులో దొరికిన వాక్ రాక్షసాలు కొన్ని:

  1) i mentally agree with u (in principle i agree with u)
  2) department of post (postal department)
  3) phenomenas (phenomenon కి బహువచనం గా వాడారు మహానుభావులు)

 9. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఒక లెక్చరర్ కొత్తగా జాయిన్ అయ్యాడు. ఒక సారి ఒక స్టూడెంట్ అందరినీ డిస్టర్బ్ చేస్తూ వుంటే మా లెక్చరర్ తనని బయటికి వెళ్ళమని ఇలా చెప్పాడు.

  “లెక్చరర్ కి గెట్ ఔట్ అని చెప్పడానికి రాక తను క్లాస్ లో నుంచి బయటికి వెళ్ళి స్టూడెంట్ ని కమిన్, కమిన్ అని పిలిచాడు.”
  ఆ లెక్చరర్ ఇప్పుడు అసిస్టంట్ ప్రొఫెసర్ అయ్యడని విన్నాను.

 10. chaala baagunnayi giliginthalu…..

  soumya gaarannatlu oriya vaallake kaadu….bengali vallai..gujarathi vallaki kooda sarigga raadu english….
  bengaali vaallu koncham oriya vallani follow ayinaa ..gujarathi vaalla pronounciation koncham tedaa gaa untundi…snacks ni snakes ani antaaru….chaala funny gaa untundi vinadaaniki…

  malayalees di inko rakam..twenty..ni twendi ani…
  bus ni bes ani antaaru…

  okko praanttham valladi okko style anukuntaa……kaani chaala pranthaalo maatram sha ni sa gaane palukutaaranukuntaa…..

  emantaaru???

 11. ఈ మధ్యే మరొక “బట్లర్ ఇంగ్లిష్ గిలిగింత” కలిగింది.
  అది ఇక్కడ పంపుతున్నాను .సోని ఛానెల్ లొ “ఇండియన్ ఐడల్ ” అని ఒక రియాల్టీ షో ప్రసారం అవుతోంది. దీని గురించి నేను ప్రత్యేకం గా పరిచయం చెయ్యక్కర్లేదు. ఈ సారి అభ్యర్థులలో ఒక అబ్బాయి రాజస్తానీ ఫొక్ సింగర్.తను ఇంత వరకు బాలివుడ్ పాటలు పాడలేదంటా.ఇండియన్ ఐడల్కి వచ్చాకే పాడ్డం మొదలు పెట్టాడంటా.ఒక బాలివుడ్ పాట పాడేసాడు…షరా మాములుగా మన వ్యాఖ్యాతలు మరియు న్యాయ నిర్ణేతలు పొగిడారు. వ్యాఖ్యాత అడిగారు మీరు మొదటి సారి బాలివుడ్ పాట పాడారు కదా ఎలా అనిపించింది అని..దానికి మన అభ్యర్థి అబ్బాయి బాగుంది…ఇప్పుడు నేను ఫోక్ నుంచి రాక్ పాట పాడతాను అనేదానికి ఫోక్ నుంచి రోక్ పాడతాను చూడండి అని అన్నాడు.
  వెంటనే న్యాయనిర్నేతలలో ఒకరైన సునిధి చౌహాన్
  హింది లో ఇలా అన్నారు “ఆప్ కొ రోక్ గానే సె కోయి రోక్ నహిన్ సక్తే ” (రోక్ అంటే హిందిలో ఆపడం,మిమ్మల్ని రాక్ పాడ్డం లొ ఎవరూ ఆపరు లెండి”) .వెంటనే అక్కడ నవ్వుల పువ్వులు విరిసాయనుకోండి.. ఇప్పుడు ఆ అబ్బాయి బానే ఇంప్రూవ్ అవుతున్నాడు..

  • ఉత్తరాది వాళ్ళు Rock అనే పదాన్ని మనలా రాక్ అని కాక రోక్ అని పలుకుతారు చాలా మంది. Thanks for sharing your experience.

 12. మా కంపెనీ లో ఒక సారి ఒక అతను ఇంకొకడితో అంటునాడు నువ్వు రెడీ, నీను రెడీ, కారు రెడీ, మనం వేలాధామ అని ఇంగ్లిష్ లో ఇలా అంటునాడు
  you ready, i ready, car ready, go.

వ్యాఖ్యలను మూసివేసారు.