బట్లర్ ఇంగ్లీషు గిలిగింతలు

ఒక మిత్రుడు మరో మిత్రుడితో “నీకు ఇంగ్లీషు స్పీకింగ్ కమింగా”
“నీ ఇంగ్లీషు విన్న తర్వాత ఇప్పుడిప్పుడే గోయింగ్”
******************************************
కొడుకు తండ్రితో…”నాన్నా కాక్ ఈజ్ గోయింగూ”
“గోయింగా అయితే పట్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ గంప”
******************************************
ఇది మా ఇంజనీరింగ్ కాలేజీలో నిజంగా జరిగింది.
ఇద్దరు స్టూడెంట్స్ గొడవలు పడి మా కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ దగ్గరకు వెళ్ళారు. ఒకడు ఆయనతో మాట్లాడుతుంటే మరొకడు మద్యలో అడ్డుపడుతున్నాడు.
ఆయన కోపంతో ఇలా అన్నాడు.
“he talks, me talks , why you talk middle middle”
ఇక మా స్నేహితుల మద్య ఎలాంటి గొడవలున్నా సరే ఎవరైనా సరే పై మాటలు అన్నారంటే వాతావరణమంతా తేలికైపోయి హాయిగా నవ్వుకుంటాం. భలే ఉంది కదూ