నెపోలియన్ గుండెధైర్యం

ఒక సారి నెపోలియన్ రాజ సభలో ఉన్నవారందరూ కలిసి ఆయనకున్న గుండెధైర్యం ఏపాటిదో తెలుసుకోవాలనుకున్నారట. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే రాజ సభలో ఉన్నపుడు ఆయన చేతికి ఓ కప్పులో తేనీరు ఇవ్వాలి. నెపోలియన్ కు తెలియకుండా బయట కొన్ని ఫిరంగులను ఒక్క సారిగా పేల్చాలి.
అనుకున్నట్టే మరుసటి రోజు ఏర్పాట్లు చేశారు. నెపోలియన్ తో పాటు అందరికీ తేనేరు ఇచ్చారు. ఒక్క నెపోలియన్ కు తప్ప అందరికీ బయట ఫిరంగులు పేలతాయని తెలుసు. సరిగ్గా అనుకున్న సమయానికి అనుకున్నట్టు ఫిరంగులు పేల్చారు. అందరి చేతిలోని టీ కప్పులు ఒలికాయి, ఒక్క నెపోలియన్ చేతిలో కప్పు తప్ప. ఆయనకున్న గుండె ధైర్యం అలాంటిది.

ప్రకటనలు

11 thoughts on “నెపోలియన్ గుండెధైర్యం

    • నేను ఆయన గుండె ధైర్యం గురించి మాత్రమే చెప్పాను. అయినా నెపోలియన్ ఒక నియంత అన్న విషయంపై చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. so take it light సోదరా!

  1. నెపోలియన్ ధైర్యవంతుడు మాత్రమేకాదు, అతనికున్న జ్ఞాపక శక్తి ఎవ్వరికీ లేదు. లక్షల్లో ఉన్న సైనికులను ప్రతిఒక్కరినీ పేరుతోటి పిలిచేవాడు. అతని చేతికి ‘T ‘ అక్షరం తో ఒక ఉంగరం ఉండేది. అంటే టార్గెట్. అంటే తన లక్ష్యం వైపు ఏక దీక్షగ ప్రయాణం చేసి గడ్డు కాలం లో ఫ్రాన్స్ ని రక్షించిన ‘నియంత ‘. యూరప్ చరిత్ర లో ఫ్రాన్స్ కి ఒక గౌరవ స్థానాన్ని సంపాదించిపెట్టిన ఘనుడు. ఫ్రాన్స్ విప్లవం ముగిసిన చాలా కాలానికి విప్లవ ఆశయాలను సాధించిన దీక్షాపరుడు. ‘క్రింద పడిపొయిన ఫ్రాన్స్ కిరీటాని తనే తీసి తన తల మీద అలంకరించు కున్నానని ‘ తనే చెప్పుకున్నాడు.

  2. అయ్యో నేను ఈ పోస్ట్ చదివాకా గాని తెలియలేదు వి వి వినాయక్ టాలెంట్ ఇంత దారుణం గా కాపీ కొట్టాడా 🙂

వ్యాఖ్యలను మూసివేసారు.