నెపోలియన్ గుండెధైర్యం

ఒక సారి నెపోలియన్ రాజ సభలో ఉన్నవారందరూ కలిసి ఆయనకున్న గుండెధైర్యం ఏపాటిదో తెలుసుకోవాలనుకున్నారట. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే రాజ సభలో ఉన్నపుడు ఆయన చేతికి ఓ కప్పులో తేనీరు ఇవ్వాలి. నెపోలియన్ కు తెలియకుండా బయట కొన్ని ఫిరంగులను ఒక్క సారిగా పేల్చాలి.
అనుకున్నట్టే మరుసటి రోజు ఏర్పాట్లు చేశారు. నెపోలియన్ తో పాటు అందరికీ తేనేరు ఇచ్చారు. ఒక్క నెపోలియన్ కు తప్ప అందరికీ బయట ఫిరంగులు పేలతాయని తెలుసు. సరిగ్గా అనుకున్న సమయానికి అనుకున్నట్టు ఫిరంగులు పేల్చారు. అందరి చేతిలోని టీ కప్పులు ఒలికాయి, ఒక్క నెపోలియన్ చేతిలో కప్పు తప్ప. ఆయనకున్న గుండె ధైర్యం అలాంటిది.