ఎలా ఉంది నా బలం…

ఒక పల్లెటూరు వ్యక్తి మొట్ట మొదటి సారిగా బస్సు ఎక్కాడు. డ్రైవర్ వెనకనే ఉన్న సీటులో కూర్చున్నాడు. ఎక్కడం మొదటి సారి కాబట్టి డ్రైవ్ చేయడాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాడు స్టీరింగ్ ఎలా తిప్పుతున్నాడు, గేరు ఎలా వేస్తున్నాడు? అంతా విచిత్రంగా ఉంది ఆయనకు.
ఒక చోట టీ తాగడానికి బస్సు ఆపి దిగాడు. తిరిగి వచ్చి బస్సు ప్రారంభించాలని గేరు వైపు చూశాడు. అక్కడ లేదు. చుట్టూ చూశాడు. మన పెద్దాయన గేరు చేతిలో పట్టుకుని నవ్వుతూ పక్కనే నిల్చున్నాడు.
“ఏంటయ్యా నీకేమైనా బుద్దుందా? గేరు ఎందుకు విరిచేశావు?” అడిగాడు డ్రైవర్.
“చాల్చాల్లేవయ్యా! నేను బస్సు ఎక్కినప్పట్నుంచీ చూస్తున్నాను. ఆ రాడ్ ను ఇరగ్గొట్టలేక అన్ని తంటాలు పడుతున్నావు. అది నీకు అడ్డమైతే నాకు చెప్పచ్చు గదా!. అందుకనే నా బలమంతా ఉపయోగించి ఒక్క దెబ్బతో ఇరిచేశా!!!!!! ఎలా ఉంది నా బలం?”
ఆఆఆఆ……..