నా టికెట్ పోయింది…

జార్జి బెర్నార్డ్ షా ఒకసారి రైల్లో ప్రయాణిస్తున్నాడు.
టికెట్ తనిఖీ చేయడానికి టి.టి.ఇ వచ్చాడు. జార్జి మాత్రం తన టికెట్ కోసం గాబరాగా వెతుకుతున్నాడు. ఆందోళన పడుతున్నాడు. ఆ టికెట్ ఎగ్జామినర్ కి జార్జి బెర్నార్డ్ షా గురించి బాగా తెలుసు.
“సర్లెండి సార్! మీరు టికెట్ తీసుకునే ఉంటార్లెండి. ఎక్కడో పెట్టుకుని మర్చిపోయింటారు. పర్లేదు” అన్నాడు
“అది కాదయ్యా బాబూ! నేనెక్కడ దిగాలో మరిచిపోయాను!!! అది ఆ టికెట్లోనే ఉంది మరి”