స్వాతంత్ర్య దినోత్సవం నా జ్ఞాపకాలు

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దాదాపు అన్నిసార్లు ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవంకానీ, జనవరి 26 గణతంత్ర దినోత్సవానికి కానీ తప్పక హాజరయ్యేవాడిని. ముందురోజు నా స్నేహితులందర్నీ “ఏరా! రేపు జండా వందనానికి వస్తున్నావా?” అని అడిగే వాడిని. రాను అని చెప్పాడా ఇంక వాడైపోయాడే :-). చిన్న పాటి క్లాస్ పీకేవాణ్ణి. చివరికి ముక్తాయింపుగా “రేపు నువ్వు జండా వందనానికి రాకపోతే మాత్రం ఈ జాతికే అవమానం” అని ఒక భారీ డైలాగు పేల్చేవాణ్ణి. 🙂
దాన్ని ఒక చెవిలోనుంచి విని మరో చెవిలో వదిలేసేవారు మాత్రం మరుసటి రోజు వచ్చేవాళ్ళు కాదు. పాపం దాన్ని సీరియస్ గా తీసుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా హాజరయ్యేవాళ్ళు. నన్ను తప్పకుండా పలకరించేవాళ్ళు. “చూడు మేంకూడా వచ్చాం” అని చెప్పడానికి.
“జండా వందనానికి వస్తేనే జాతి మీద గౌరవం ఉన్నట్టా?” అని వాదించేవాళ్ళూ లేకపోలేదు.
“భావితరాల వారు స్వేచ్చగా బ్రతకడానికి కొన్ని ఏళ్ళపాటు నిస్వార్థంగా తెల్లవాళ్ళతో పోరాడి అసువులు బాసిన అమరవీరులందరికీ నివాళులర్పించడానికి సంవత్సరంలో ఒక్క రోజులో ఒక్క రెండు గంటల సమయం కేటాయించమని అడగటం పెద్ద కోరిక కాదేమో. ఏమంటారు? “

ప్రకటనలు

One thought on “స్వాతంత్ర్య దినోత్సవం నా జ్ఞాపకాలు

  1. ఇటువంటి విషయాలలో నేను ఒక చెవిలోనుంచి విని మరో చెవిలో వదిలేసేవారి టైపు అయినా, మీరు చెప్పినదానితో ఏకీభవించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు.

    ఒక్కొసారి స్వాతంత్ర్యం రాకుండా వుండి వుంటేనే మన దేశం ఇంకా బాగుపడి వుండేదెమో అనిపిస్తూ వుంటుంది.

వ్యాఖ్యలను మూసివేసారు.