నీకేమనిపిస్తోంది?

ఇద్దరు పెద్ద మనుషులు ఒక క్యాంపు కోసం బయటకు వెళ్ళారు. రాత్రి సుష్టుగా భోంచేసి వెంట తెచ్చుకున్న గుడారం వేసుకుని చక్కగా మాట్లాడుకుంటూ నిద్రపోయారు.
కొద్దిసేపటి తర్వాత ఒకాయనకు మెలుకువ వచ్చింది. రెండో అతన్ని నిద్ర లేపి “ఈ ఆకాశం, ఈ నక్షత్రాలు చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది?” అని అడిగాడు.
“లెక్కలేనన్ని నక్షత్రాలు కనిపిస్తున్నాయి” అన్నాడు.
“అది సరే వాటి నుంచి నువ్వేమి తెలుసుకున్నావు?”
“జ్యోతిష శాస్త్రం ప్రకారం శని సింహ రాశిలో ప్రవేశిస్తున్నాడు”
“ఖగోళ శాస్త్రం ప్రకారం మిల్లియన్ల కొద్దీ పాలపుంతలు, బిలియన్ల కొద్దీ గ్రహాలు ఈ విశ్వాంతరాళంలో నాకు గోచరిస్తున్నాయి”
“వాతావరణ శాస్త్రం ప్రకారం రేపటి దినం ఆకాశం నిర్మలంగా ఉంటుంది”
…..
“ఓరి నీ పాండిత్యం తగలెయ్యా!!! మన గుడారం ఎవరో ఎత్తుకుపోయారయ్యా….

Note: ఈ జోకు ప్రపంచంలో అత్యుత్తమ జోకుల్లో ఒకటిగా ఎంపికైంది.

ప్రకటనలు

3 thoughts on “నీకేమనిపిస్తోంది?

వ్యాఖ్యలను మూసివేసారు.