పైరగాలి పాట వింటూ పరవశించిపోవాలని
చేనుగట్ల మీద పరుగెడుతూ తూనీగలతో ఆటలాడాలని
కల్మషంలేని పసిమనసులతో కలిసి సల్లాపాలాడాలని
అలుపెరుగని ఆటల సంద్రంలో మునిగితేలాలని
ఆకాశమే హద్దుగా ఎగిరిపోయే చిట్టిగువ్వనవ్వాలని
హద్దేలేని ఊహల ఊయలలో ఊగిసలాడాలని
మరపురాని మధురానుభూతుల్ని మళ్ళీ అనుభవించాలని
4 thoughts on “చిన్ని చిన్ని ఆశ”
వ్యాఖ్యలను మూసివేసారు.
బాగున్నాయి మీ చిన్ని చిన్ని ఆశలు. నా కోరికలకు దాదాపు దగ్గరగా ఉన్నాయి.
మరినా కోరికలు చదువుతారా… ?
నేనో విహంగమై విను వీధుల విహరించాలి…
ప్రకృతి కాంత పరువాలు వొకపరి పరికించాలి…
మబ్బులతో మాటాడాలి…
మామ చంద్రునికో ముద్దు పెట్టాలి…
హిమగిరి పర్వతాలు ఎక్కి ఆడాలి..
కాశ్మీరమంతా కనులారా వీక్షించాలి…
ప్రపంచ శాంతి కపోతమై జీవించాలి…
భళా!
చాలా బాగున్నాయి . ధన్యవాదాలు
ఆశల సంద్రంలో అలనై నీకు తోడుండాలని,
ఆనందాల జల్లులలో నీతో కలసి తడవాలని
ఏవో ఊహలు, అన్నో కోరికలు
Thank you very much