చిన్ని చిన్ని ఆశ

పైరగాలి పాట వింటూ పరవశించిపోవాలని
చేనుగట్ల మీద పరుగెడుతూ తూనీగలతో ఆటలాడాలని
కల్మషంలేని పసిమనసులతో కలిసి సల్లాపాలాడాలని
అలుపెరుగని ఆటల సంద్రంలో మునిగితేలాలని
ఆకాశమే హద్దుగా ఎగిరిపోయే చిట్టిగువ్వనవ్వాలని
హద్దేలేని ఊహల ఊయలలో ఊగిసలాడాలని
మరపురాని మధురానుభూతుల్ని మళ్ళీ అనుభవించాలని