బిల్ గేట్స్ ఇంటర్వ్యూ

బిల్ గేట్స్ తన తర్వాత మైక్రోసాఫ్ట్ కు చైర్మన్ పదవికి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడానికి తానే స్వయంగా రంగంలోకి దిగాడు.
దాదాపు 5000 దరఖాస్తులు వచ్చాయి. అందరూ ఒక పేద్ద గదిలో సమావేశ మయ్యారు. వారిలో మన తెలుగువారైన రెడ్డి గారు కూడా ఒకరున్నారు.
బిల్ గేట్స్ రానే వచ్చాడు. వచ్చినందకు అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.
“మీలో డాట్ నెట్ ప్రోగ్రామింగ్ తెలియని వాళ్ళు లేచి వెళ్ళిపోవచ్చు” అన్నాడు.
2500 మంది లేచి వెళ్ళి పోయారు. మన రెడ్డి గారు మాత్రం “నాకూ డాట్‌నెట్ రాదు. అయినా ఉంటే ఏం పోయిందిలే” అనుకుని సర్ది చెప్పుకుని కూర్చున్నాడు.
బిల్ గేట్స్ మళ్ళీ అందుకుని “మీలో మేనేజ్‌మెంట్ డిగ్రీలు లేని వాళ్ళు కూడా లేచి వెళ్ళిపోవచ్చు” అన్నాడు
ఇంకో 2000 మంది లేచి వెళ్ళిపోయారు.
“నేను 15 ఏళ్ళ వయసులోనే చదువు ఆపేశాను. అయినా ప్రయత్నం చేయడంలో తప్పేముంది” అనుకుని అక్కడి నుంచి కదలలేదు.
500 మంది మాత్రం మిగిలారు.
మళ్ళీ బిల్ గేట్స్ వచ్చి “మీలో సెర్బో-క్రోట్ తెలియని వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు” అన్నాడు.
498 లేచి వెళ్ళిపోయారు.
“నాకు సెర్బో-క్రోట్ అంటే ఏమిటో కూడా తెలియదు. అయినా ఇంత దాకా వచ్చా కదా. చివరి దాకా ప్రయత్నిస్తే పోయేదేముంది” అనుకుని అలాగే కూర్చున్నాడు.
బిల్ గేట్స్ ఇంక మిగిలిన ఇద్దరినీ కలిపి ” సో మీ ఇద్దరికీ సెర్బో-క్రోట్ తెలుసున్న మాట. గ్రేట్!”
“ఏదీ మీరిద్దరూ ఒక సారి ఆ భాషలో మాట్లాడుకోండి చూద్దాం”
అనగానే రెడ్డి పక్కనున్న అభ్యర్థి వైపు తిరిగి “ఆ ఏం మామా ఎలా ఉన్నావు?” అన్నాడు.
“మస్తుగున్న మామా!” అవతలి వైపు నుంచి సమాధానం వచ్చింది.
బిల్ గేట్స్ నవ్వుతూ వారి వైపు చూసి మీ ఇద్దరినీ సెలెక్ట్ చేస్తున్నానని చెప్పి కరచాలనం చేసి వెళ్ళి పోయాడు.