ధర్మ సందేహం

ఒక మాస్టారు ఆరో తరగతి పిల్లలకు మహాభారతం కథను బోధిస్తున్నాడు. అందులో కృష్ణుని జన్మ వృత్తాంతం గురించి ప్రస్తావన వచ్చింది.
“సోదరి యొక్క అష్టమ సంతానం చేతిలో తన చావు తప్పదని ఆకాశవాణి ద్వారా తెలుసుకున్న కంసుడు ఆగ్రహోదరుడయ్యాడు. దేవకీని ఆమె భర్తను కారాగారంలో బంధించమని ఆజ్ఞ జారీ చేశాడు.”
“మొదటి కొడుకు పుట్టాడు. కంసుడు ఆ బిడ్డను విషమిచ్చి చంపేశాడు. రెండో కొడుకు పుట్టాడు. వాణ్ణి ఎత్తైన కొండ మీద నుంచి తోసి చంపి వేయించాడు. ……” చెప్పుకుంటూ పోతున్నాడు.
వారిలో కొంచెం తెలివైన విద్యార్థికి ఒక సందేహం వచ్చింది. బుర్ర గోక్కుంటూ
“మాస్టారూ! నాదో చిన్న సందేహం” అన్నాడు
“భారతదేశంలో అందరూ మహాభారతాన్ని విశ్వశిస్తారు నాయనా! నీ సందేహమేమిటో చెప్పు నేను తీరుస్తాను”
“మరి కంసుడికి దేవకికి పుట్టే సంతానం చేతిలో మరణం ఉందని తెలుసు కదా? అయితే వాళ్ళిద్దరినీ ఒకే గదిలో ఎందుకు బంధించాడు?” 😉
మాస్టారికి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు.