50 సంవత్సరాల నాటి వేంకటేశ్వరుని నిజరూప దర్శనం

క్రింద పేర్కొన్న వీడియో 50 సంవత్సరాలకు పూర్వం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి మూల విగ్రహానికి అభిషేకం చేస్తున్నపుడు తీసినట్లుగా చెప్పబడుతోంది. దీనిలో నిజానిజాలేంటో నాకు తెలీదుకానీ మీరు కూడా చూడాలనుకుంటే క్రింది వీడియోను చూడండి

ప్రకటనలు

8 thoughts on “50 సంవత్సరాల నాటి వేంకటేశ్వరుని నిజరూప దర్శనం

 1. స్వామి వారి గుడి లోపలికి కెమేరాలను అనుమతించడం మనమేనాడూ వినలేదు. ఇప్పుడంటే వీడియో కెమేరాలు, మొబైల్ ఫోన్ కెమేరాలు వచ్చాయి ( దొంగతనంగా పిక్చరైజ్ చేయడానికి ). 50 ఏళ్ళ క్రితం ఆ అవకాశం కూడా లేదు.
  ఇలా గర్భ గుడిలో పిక్చరైజ్ చేయాలంటే, ఆ రోజుల్లో కన్వెన్షనల్ కెమేరాతో, పెద్ద లైటింగ్ అరేంజ్మెంట్లతో ( గర్భ గుడిలో ఫిల్మ్ షూటింగ్ కు సరిపడా వెలుతురు ఉండదు కదా ! ) పిక్చరైజ్ చేయాలి. అప్పుడు ఇప్పటి కంటె శిష్టాచారాలను, సంప్రదాయాలను నిష్ఠగా పాటించే వారు కాబట్టి అందుకు అనుమతించారంటే నమ్మలేము. ఫిల్మ్ లైటింగ్ క్వాలిటిని బట్టి ఇది తప్పకుండా ఏదో పాత సినిమా క్లిప్పింగ్ అయి ఉంటుందని నాకు అనుమానం కలిగింది.
  ఆ దిశలో ఆలోచిస్తే … పి. పుల్లయ్య గారు తీసిన, NTR నటించిన ” శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం ” లో ఈ సీన్ లేదు. దాన్ని మనమందరం ఎన్నోమార్లు చూసాం. ” అంతకన్నా పాత సినిమా ఏదైనా ఉందా ? ” అని పరిశోధించాను. పుల్లయ్య గారే ఆంతకన్న ముందు, CSR వేంకటేశ్వరునిగా, తన భార్య ” శాంత కుమారి ” పద్మావతిగా ఒక ” వేంకటేశ్వర మహాత్మ్యం ” చిత్రాన్ని రూపొందించారని తేలింది. ఇప్పుడా చిత్రం పూర్తి ప్రతి ఉందో లేదో కాని, బహుశః TV 9 వాళ్ళు ఆ సినిమాలోని ఒక చిన్న క్లిప్పింగును సాధించి, ఇలా ప్రసారం చేసి, చాలా మంది భక్తుల చెవిలో పువ్వు పెట్టి ఉంటారని నేను నిర్ధారణకు వచ్చాను.
  ఇక లోగుట్టు పెరుమాళ్ళ కెరుక !

 2. I am 57 yrs young, and 50 years ago being from Tirupati, visit to Tirumala was a monthly affair, and my memory confirms the video being genuine.
  I vividly remember the scenes in side the temple was like this only.
  I am not sure why it can’t be filmed, as we worship any idol in any place where we have the faith.The uthsava vigrahams of Lord are blatantly filmed. Rather, filming will help elderly and diabled to have darshan at will.

 3. రవిచంద్ర గారూ,ఈ వీడియో లో మొదటి భాగం మాత్రం నిజంగా తీసిన్ది అయి ఉండవచ్చు…కానీ స్వామివారు మాత్రం సెట్టింగే…ఘంటసాల వారి గాత్రంతో ఆరంభం అవుతోంది చూశారా…ఈ వెధవ న్యూస్ ఛానళ్ళమీద నిషేధం పెడితేగాని దేశం బాగు పడదు..

వ్యాఖ్యలను మూసివేసారు.