గవర్న్‌మెంట్ స్కూలా? ప్రైవేట్ స్కూలా?

“అవ్వా! నేను తొమ్మిదో తరగతికి కాళహస్తికి వెళ్ళి చదువుకుంటానవ్వా” అన్నాడో అబ్బాయి వాళ్ళ అమ్మమ్మతో.
“సరే నాయనా! ఏ బడిలో చేరతావు?” అడిగింది అవ్వ.
వయసులో చిన్నవాడయినా ఆ అబ్బాయికి తన కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి తెలుసు.ప్రైవేటు స్కూలంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారమని అతనికి తెలుసు.అవన్నీ వాళ్ళకి చెప్పకుండా
“గవర్న్‌మెంట్ బాయ్స్ హైస్కూల్ ఉంది కదా అందులో చేరతా” అన్నాడు.
“అక్కడ సరిగా చెప్పరంట కద నాయనా. ఏదైనా ప్రైవేటు స్కూల్లో చేరకూడదూ” అంది అవ్వ.
“ఏదో తెలియని వాళ్ళు చెప్పుంటార్లే అవ్వా.నేను అక్కడే చదువుతాను. అయినా గవర్న్‌మెంట్ స్కూల్లో అయితే మంచి టీచర్లుంటారు. ప్రైవేటు స్కూల్లో అయితే మంచి క్వాలిఫికేషన్ ఉండే టీచర్లు ఉండరు.ఇంక టీచింగ్ అంటావా.
రైతు భూమిలో విత్తనాలు చల్లుతూ పోతాడు. మంచి సారవంతమైన భూమిలో పడిన విత్తనాలు మంచి ఏపైన మొక్కలుగా ఎదుగుతాయి. అలాగే నిస్సారమైన భూమిలో పడిన విత్తనాలు సరిగా మొలకెత్తవు. మొలకెత్తినా సరిగా ఎదగవు. మనం చేయవలసిందల్లా మన బుద్ధిని చదువు మీద కేంద్రీకరించడమే.వాళ్ళు అందరికీ ఒకే పాఠాలు చెబుతారు. శ్రద్ధగా విన్నవాళ్ళు ఒంటబట్టించుకుంటారు.మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు.అంతే ”
అని ఒప్పించి మరీ ఆబడిలో చేరాడు. అక్కడ చేరినందుకు అతనెప్పుడూ బాధపడలేదు. పైగా వచ్చిన రెండు సంవత్సరాల్లోనే అక్కడి ఉపాధ్యాయుల అందరి అభిమానం చూరగొని పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి పాఠశాల లో రెండో స్థానంలో నిలిచాడు.

ఇప్పుడాబ్బాయి మంచి ఉద్యోగంలో సెటిలయ్యాడు. వాళ్ళ అమ్మమ్మ మాత్రం తన దగ్గరికి ఎవరొచ్చినా పై సంఘటన వివరించి మనవడి గురించి గొప్పగా చెబుతుంటుంది.

14 thoughts on “గవర్న్‌మెంట్ స్కూలా? ప్రైవేట్ స్కూలా?

 1. baagundi……..nenu govt school lone chadivaanu…..

  appudu parents commitys ani vundevi…daanivalla month ki oksaari vallu school ela nadustundi ani checkup chese vaaru….ippudu chaduvukunna maname …dilli public school baguntunda leka veredi baaguntunda ani posts raastunnamu gaani ala manam cheddam ani aalochinchatam ledu…….

  naaku inka marriage kaaledu but nenu eppudo decide ayyanu pillalani govt school lone join cheyaali….ani..atleast mana valla kontamandi ayina manchi chaduvu pondutaaru………

 2. చాలా బాగా చెప్పారు వినయ్ గారు. అందుకనే మా మేనకోడల్ని మా అక్క ప్రైవేటు స్కూల్లో చేర్పించమని చెప్పినా నేను బలవంతంగా నేను చేరిన స్కూల్లోనే చేర్పించాను.

  సో మీరు భవిష్యత్తులో చేయబోయే పనిని నేను ఆల్రెడీచేశానన్న మాట 🙂

 3. ennallako oka mahanu bhaudini prabhutva pathasaalala pai gouravam kaligini vaari vakkulu vinadam to naa janma dhanyamaindani bhavistanu. enno avarodhalato.. marenno lopalato prabhutva pathasaalalu nirveeryamaipotunnai. endaro konni lakshala mandini poti parikshalalo oodinchi ee upadyaya vruttini chepatti ento konta vidyanandiddamani unukunte. kasta chadavagala, peddala protsham kala pilla landaru kanumarugai, ee praivate pathasaala ranivvani, endukoo panikirani nistejamaina pillalu matrame maa prabhutva pathasaalallo cherutunnaru. peddalanta meela alochinchite ika maa anandaniki avadhulundavu.

  • మన:పూర్వక ధన్యవాదాలు నరసింహన్ గారూ! నా బ్లాగు ప్రారంభించినప్పటి నుంచీ వచ్చిన అత్యుత్తమ వ్యాఖ్యలలో ఒకటిగా దీన్ని భావిస్తున్నాను. నేను రాసింది నా వ్యక్తిగత అనుభవాన్నైనా కొంత మంది మనసునైనా కదిలించి వారిలో చైతన్యం కలిగించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేరిస్తే ఈ టపా రాసినందకు నా లక్ష్యం నేరవేరినట్లు భావించాను. కానీ అంతకంటే ఎక్కువగానే వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది.

   కానీ మీరేమనుకోకుంటే ఒక్క విషయం. వివేకానందుడు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరిలో నిద్రాణమైన శక్తి నెలకొని ఉంటుంది. మీరు అనుకుంటే ప్రస్తుతం మీ దగ్గరకు వచ్చే విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దడం పెద్ద కష్టం కాదనుకుంటాను.

 4. నేను కూడా ప్రభుత్వ పాఠశాల లో నే చదువుకున్నాను. అందుకే ఈ మాత్రమైనా బాగుపడ్డాను అని నేననుకుంటూ ఉంటాను. మా పెద్దనాన్నగారనేవారూ…ప్రభుత్వ పాఠశాల లో, తెలుగు మీడియం లో చదువుకుంటే తెలుగు, English రెండూ బాగా వస్తాయి. అదే private school, english medium లో చదువుకుంటే రెండూ సరిగ్గా రావు అని. మాత్రుభాష లో ఆలోచించలేనివాళ్ళ పరభాష లో ఎలా ఆలోచిస్తారు అనేవారు. ప్రభుత్వ పాఠశాల లో, ఉపాధ్యాయులు పాఠం చెప్పడం మీద ఇష్టం తో పాఠం చెప్తారు, కానీ private school లో బ్రతుకుతెరువు కోసం పాఠం చెప్తారు అని చెప్పేవారు. నా మటుకు నేను Degree వరకు కూడా ప్రభుత్వ కళాసాల‌ లో నే తెలుగు మీడియం లో నే చదువుకున్నాను. MA, Mphil, Ph.D కూడా విశ్వవిద్యాలయం (central university, Hyderabad) లో నే చదువుకున్నాను.

  ఈ post రాసినందుకు మీకు ధన్యవాదాలు.

  • మీ లాంటి విద్యాధికుల ప్రశంసలు పొందడం కంటే నాకింకేం కావాలండీ! మీరు బ్లాగులో పోస్టు రాయగానే గూగుల్ లో మీ ప్రొఫైల్ కోసం వెతికా. మీరు ఆర్థిక విషయాలపై పరిశోధనా పత్రాలు సమర్పించి ఉన్నారు కదా! మీరు మంచి విషయాలపై పరిశోధన చేస్తున్నారు.ఆశ్చర్యపోయాను తెలుసా? మీలాంటి వారి ఆదరణ పొందుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.

   • అవును నేను Economics లో PhD చేసాను. అయినా మీరనుకున్నంత పెద్దదాన్ని ఏమీకాదులెండి. తెలుగు మీద అభిమానం తో అన్ని blogs చదువుతూంటాను. మన తెలుగు ని అభివ్రుద్ధి పరిచే దిశ లో సాగుతున్న మీవంటివారికి నా అభినందనలు, ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది.

    అయినా నా profile ని గూగల్ లో ఎలా కనుక్కున్నారు. spelling తేడా ఉంటుందే!!!!

 5. talent ki medium tho paniledu. english medium lo chadivithe telugu english lo evi sarigga ravu anedi just a superstition.
  evaru chadivinavi vallaki great ga anipistayi thats good. but migitavi under estimate cheyykudadu.

 6. అది మీరేనా.. వావ్.. కంగ్రాట్స్ రవి గారు..మీ మామ్మ గారి మీద ఒక మాంచి పోస్ట్ రాయాలి అది మేము చదవాలి

వ్యాఖ్యలను మూసివేసారు.