వేలం వెర్రి అంటే ఇదేనేమో

మగధీర సినిమా చూడాలని ఆన్‌లైన్ లో టిక్కెట్ల కోసం చూస్తున్నాం.
విడుదలయ్యే రోజుతో మొదలు పెట్టాం.అయితే ఒక సారి పేజీ రిఫ్రెష్ అవ్వగానే టికెట్లన్నీ అమ్ముడుపోయి ఉన్నాయి.
సరే తరువాత రోజుకైనా దొరుకుతాయేనంటే మళ్ళీ అదే పరిస్థితి. మేము పేజీ రిఫ్రెష్ చేసే లోగా ఒక రోజు టికెట్లు బుక్ అయిపోతున్నాయి.
అలా ఆగస్టు 5 తేదీ దాకా చూశాం. లాభం లేదు.

విపరీతమైన ప్రచారం బాగా వర్క్‌అవుట్ అయినట్లుంది.
ఏం చేస్తాం ఒక గొర్రె ఒక దిక్కుకెళ్ళిందంటే మిగతా గొర్రెలన్నీ దాని ఫాలో అయిపోతాయి మరి.

10 thoughts on “వేలం వెర్రి అంటే ఇదేనేమో

 1. >>”ఏం చేస్తాం ఒక గొర్రె ఒక దిక్కుకెళ్ళిందంటే మిగతా గొర్రెలన్నీ దాని ఫాలో అయిపోతాయి మరి.”

  హ హ హ మరి మీరు. 🙂 🙂 🙂

  • నేను గొర్రెను కాదు. ఎందుకంటే టికెట్ కొనలేదుగా. 🙂 🙂 🙂
   టికెట్ సాధారణ ధరకు దొరికినప్పుడే కొంటాను.

  • అదేం మాట? నా వ్యాఖ్యని మీరు సరిగా అర్థం చేసుకున్నట్లు లేరు. ట్రైలర్స్ చూసి నేను కూడా సినిమా హిట్ కావాలనే కోరుకుంటున్నాను. అందుకనే టికెట్ కోసం ప్రయత్నించింది.
   నేననేది కొంతమంది సినిమా రిలీజైనపుడు సాధ్యమైనంత తొందరగా సినిమా చూసేయాలని వెయ్యి రూపాయలు కూడా వెచ్చించి టికెట్లు కొనుక్కునే వారి గురించి.

 2. హ్హ హ్హ (వికటాట్టహాసం అన్నమాట) మేము పుణె లో థియేటర్ కి వెళ్ళి టికెట్స్ బుక్ చేసాం..సులువుగానే దొరికాయి. అంధ్ర లో కాకుండా బయట ఉంటే ఇదొక అడ్వాంటేజ్ అన్నమాట..

వ్యాఖ్యలను మూసివేసారు.