జానపదం అంతరించిపోతుందా?

జానపదం అంతరించిపోవడం లేదు.తన పరిధిని విస్తరించుకుంటుంది.  నెమ్మదిగా కంప్యూటర్ ప్రపంచం లోకీ విస్తరిస్తోంది. కావాలంటే క్రింద జతపరచిన యూట్యూబ్ వీడియోను సందర్శించండి.దాని ఎంతమంది చూశారో గమనించండి.కంప్యూటర్ తో కుస్తీ పట్టినంత మాత్రాన తెలుగు వారు తమ జానపద సంగీతాన్ని మరిచిపోలేదనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ కళాకారులకు కావల్సిందల్లా పిసరంత ప్రోత్సాహం, వాళ్ళ టాలెంట్ ను నిరూపించుకునేందుకు సరైన వేదిక.

నేను పల్లెటూరి నేపథ్యం నుంచి వచ్చిన వాడినే కనుక జానపదాలను చాలా విన్నాను. అయితే ఇటీవలే మాటీవీలో రేలా రె రేలా కార్యక్రమం చూసిన తర్వాత వాటి మీద నాకున్న ఆసక్తి ,గౌరవం రెట్టింపయింది. వాటిలో అంత మాధుర్యం ఉందా? అనిపించింది. మంచి ఆర్కెస్ట్రా తో పల్లె పదాలను మాటీవీ గ్లామరైజ్ చేసిందనడంలో అతిశయోక్తి లేదు.

5 thoughts on “జానపదం అంతరించిపోతుందా?

  1. ఈ ప్రోగ్రాం నేను కూడా చూస్తున్నాను. పాటలు చాలా బాగుంటున్నాయి

    • మా స్వస్థలం శ్రీకాళహస్తి. కానీ పుట్టింది మాత్రం చేమూరు అనే కుగ్రామం, పెరిగింది ముచ్చివోలు ( మా అమ్మమ్మ గారి ఊరు).

      • ఏమిలేదు, ‘పిసరు’ అనే పదం సామన్యంగా కోస్తాఆంధ్రులు అందులోనూ విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళు వాడుతూంటారు. అందుకని మీఊరేది అని అడిగాను.

వ్యాఖ్యలను మూసివేసారు.