అమెరికా లో రైతు బజార్లు

ఆర్థిక మాంద్యం పుణ్యమా అని అమెరికా,కెనడా దేశాల్లో రైతు బజార్లు కళకళలాడుతున్నాయట. చేతిలో కాసులు గల గల లాడుతుంటే మాల్స్, సూపర్ మార్కెట్ల వైపు పరుగులెత్తిన అమెరికా జనం పొదుపు తప్పని సరి కావడంతో వీటి వైపు మళ్ళుతున్నారట.

ఎంతో మంది మేథావులు ఎన్నో సమస్యల మీద అధ్యయనం చేస్తున్నారు. వ్యాపారంలో మధ్యవర్తుల  మూలంగా ఎంత మంది రైతులు నష్టపోతున్నారో వారికి తెలియంది కాదు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎవరు పూనుకుంటారో?

మనదేశంలో రైతులకు అలా మంచి రోజులెప్పుడొస్తాయో?
అలా వస్తే మాత్రం నా కంటే సంతోషించే వాళ్ళెవరూ ఉండరు. ఎంతైనా రైతుబిడ్డని కదా…. 🙂

ప్రకటనలు

5 thoughts on “అమెరికా లో రైతు బజార్లు

  • ఈ వార్త నిన్న ఈనాడు పేపర్ లో వచ్చిందండీ! దాని మీద నా స్పందనను ఇక్కడ చెప్పానంతే..

 1. రైతు బజారు ఈరోజు కొత్తగా వచ్చింది కాదండీ! ప్రతి వారం ఒక రోజు ఒక్కొక్క ఏరియాలో పెడుతూనే ఉంటారు. సమ్మర్లో ఆపిల్స్, చెర్రీలు, స్ట్రాబెర్రీలు ఇక్కడ చాలా తాజాగా దొరుకుతుంటాయి.

  కింద లింకు చూడండి, మిషిగన్ లో ఏ సీజన్ లో ఏవి దొరుకుతాయి? అన్న సమాచారం.

  http://www.farmersmarkets.msu.edu/portals/farmmarkets/documents/season_guide.pdf

  మీ ఊరిలో జరిగే రైతు బజారు గురించి తెలుసుకోవలంటే గూగుల్ లో “farmers market losangels” అని వెతకండి.

 2. అమెరికాలో రైతు బజార్లు ఎప్పటినుంచో వున్నాయి.అక్కడ ఎప్పుడూ జనాలు కిటకిటలాడుతూనే వుంటారు.మన పేపర్వాళ్ళు మరీ ఎక్కువ చేసి రాస్తారు.

  • అవునా! ఈ విషయం మీలాంటి వాళ్ళు చెపితేనే కదా మాకు తెలిసేది. లేకపోతే ఈ దిక్కుమాలిన పేపరు వాళ్ళు ఏది రాస్తే అది నమ్మేస్తాం మేము. యదార్థం తెలియజేసినందుకు ధన్యవాదాలు.

వ్యాఖ్యలను మూసివేసారు.