స్వచ్చమైన ప్రేమ (మీ హృదయాన్ని కదిలించే కథ)

అమెరికాకు చెందిన ఒక సైనికుడు వియత్నాంలో యుద్ధం ముగించుకుని తన స్వస్థలానికి  తిరిగి వస్తున్నాడు.దారిలో   వస్తూ వస్తూ  తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు.
“అమ్మా, నేను ఇంటికి వస్తున్నాను.ఈ సందర్భంగా మిమ్మల్ని ఒక కోరిక కోరాలనుకుంటున్నాను్.”
“ఏంటి బాబూ అది?”
” నా కొక  స్నేహితుడున్నాడు. వాడిని నాతో పాటు తీసుకురావచ్చా?”
“దానికేం భాగ్యం. అలాగే తీసుకుని రా బాబూ. నేనూ మీ నాన్న నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాం”
“కానీ మీరు ఇంకొక విషయం కూడా తప్పకుండా తెలుసుకోవాలి. నా స్నేహితుడు యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు. మందుపాతర మీద పడడం వల్ల అతను ఒక చెయ్యి, కాలూ కోల్పోయాడు.అతనికి నా అన్నవాళ్ళెవరూ లేరు. ఎక్కడికీ వెళ్ళలేడు. అతన్ని మనతో పాటే ఉంచుకుందామని నా కోరిక.”
“ఎంత పని జరిగింది నాయనా! అలాగే తీసుకునిరా. అతనికి ఎక్కడో ఒక దగ్గర నివసించడానికి ఏర్పాట్లు చేద్దాం”
“కానీ అమ్మా! అతన్ని మనతో పాటే ఉంచుకోవాలని నా కోరిక”
తండ్రి అందుకుని “నాన్నా! ఒక వికలాంగుని మనతో పాటు ఉంచుకోవాలంటే అది ఎంత భారమో నీకు అర్థం కావడం లేదు. మన జీవితాలు మనవి. వేరే వాళ్ళ కష్టాలు కూడా మనం నెత్తిన వేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మాత్రం అవన్నీ మనసులో ఉంచుకోకుండా జాగ్రత్తగా ఇంటికి వచ్చెయ్. అతను ఎలాగోలా బ్రతగ్గలడులే”
అన్నాడు.
అవతలి వైపు నుంచి ఫోన్ కట్ అయిన శబ్దం వినిపించింది.
తరువాత కొడుకు దగ్గర్నుంచి వాళ్ళకి ఎలాంటి ఫోనూ రాలేదు. కొద్దిరోజుల తర్వాత, శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసుల నుంచి ఆ దంపతులకు ఒక సమాచారం అందింది. దాని సంగ్రహం ఏమిటంటే వాళ్ళ కొడుకు ఒక భవనం పై నుంచి క్రిందపడి మరణించాడు. పోలీసులు దాన్ని ఆత్మహత్యగా భావిస్తున్నారు.
పుట్టెడు దు:ఖంలో మునిగిపోయిన ఆ తల్లిదండ్రులను పోలీసులు శవాన్ని గుర్తించడానికి మార్చురీకి తీసుకుని వెళ్ళారు.వాళ్ళు ఆ వ్యక్తిని తమ కుమారుడి గుర్తించారు. కానీ వాళ్ళకు ఇంకొక భయంకరమైన నిజం కూడా తెలిసింది. తమ కుమారుడికి ఒక చెయ్యి, కాలు లేవని.

26 thoughts on “స్వచ్చమైన ప్రేమ (మీ హృదయాన్ని కదిలించే కథ)

 1. recently i read this ……………at somewhere…….very nice story as u said

  స్వచ్చమైన ప్రేమ అంటే ఎలా ఉండాలో(ఉండకూడదో) ఈ కథ చదివిన తర్వాతే నాకు అర్థం అయింది

  i agree with this line…….

 2. అవునండీ! ఇలా కూడా జరుగుతాయి అన్నమాట మన తల్లి తండ్రులే మనల్ని పట్టించుకోకుంటే అంత కంటే విషాదం ఇంకొకటి వుండదు

 3. hello meeru ee katha cheppe mundu oka vishayam telusu kondi….
  adi eamitante Ee prapancham ea vathi aina talli tandri daggare nijamina premanu pondagalaru,
  chodagalaru so aaa vyathi chesindi tappu…
  nijamina prema koduku pina vunna kodukee amma nannanu artham chesukokunte… illagee vuntundi…
  sare naaaaa…. ohhhhh god

 4. athanu parents ni sariga ardham chesukoledhu, parents ki sun veru friend veru, family lo elanti problems vasthe parents sevalu chestharu kani bayati vallaku cheyalante andharivalla kadhu thamkodukki amaina face cheyagala capacity vunna parents kabatte army lo ki pampincharu. athanu parents ni misunderstand chesukuni parents ki thirani badhani migilchadu. athanu war lo chanipoyina bagundedhemo konchem proud ga feel ayyevaru.
  oka jawan ki antho selfconfidence vuntundhi ee story lo jawan ni pirikivadila chupinchatam naku nachaledhu this is my personal openion…..

 5. కథ వరకూ చాల బాగుంది. మనసుకి హత్తు కొంటూంది. కానీ ఇది ఆధారంగా స్వచ్చమైన ప్రేమ అంటూ చర్చించ సమకట్టటం నిజంగా కష్టమే. మనం ప్రేమను సరిగా నిర్వచించినా లేకున్నా ప్రేమ అనేది భౌతిక భావన అనేది స్పష్టం. ప్రతి భౌతికభావన ద్వన్ధభూయిష్టం. కొడుకు వికలాంగుడు అని తెలిస్తే, ఎంత కష్టమైనా తల్లి తండ్రులు భరించి ఆదరించే అవకాశం మెండు. తల్లి తండ్రులకు ఆ కష్టాన్ని కూడా కల్గించటం ఇష్టం లేక కొడుకు ఆత్మ త్యాగానికి ఒడిగట్టటం నిజంగా కంటతడి పెట్టించే ఉదాత్త సంఘటన. భౌతిక దృష్టి తో ఇరుప్రేమలూ స్వచ్చమైన వే, నిజమైనవే. నిజానికి భౌతికమైనది ప్రథిదీ అబద్ధమే.

  శ్రీరామ్ పొన్నపల్లి

  • చాలా బాగా విశ్లేషణ చేశారు. నేను ఎక్కడో ఇంటర్నెట్ లో చదివిన ఈ కథను అనువదించేటపుడు ఇంత విశ్లేషణ చేయలేదు. కానీ వ్యాఖ్యాతల కామెంట్లు చదువుతుంటే దీన్ని ఎన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చో తెలుస్తుంది. ఈ కథ నిజంగా జరిగిందీ లేనిదీ నాకు ఖచ్చితంగా తెలీదు. కానీ ఇది చదివిన తర్వాత మనసు స్పందించి అందరికీ పంచుకోవాలని ఇలా రాశానంతే. శీర్షిక అలా పెట్టడం వల్ల చాలామంది ఇలాగే అనుకున్నారు కానీ దీని ఆధారంగా స్వచ్చమైన ప్రేమను కొలవలేమనీ మీ వ్యాఖ్యతో అంగీకరిస్తున్నాను.

 6. Vinadaniki, chadavadaniki badhakaramga unna, koncham visleshana chesaka anipisthondi, athadu sainikudu, dheerudu ayi undi, analochithamuga parents ki theerani dukkham migilchadu. Koduku raka kosamai aa parents pade thapana kathalo chaala spastamga thelustondi. Aavesamlo theesukone nirnayalu ilage dukkha dayakamuga untayi anadaniki idoka udaharanaga cheppavachu.

వ్యాఖ్యలను మూసివేసారు.