సమాధానం సూటిగా, సందర్భోచితంగా ఉండాలి

ఒక పదేళ్ళ బాలుడు ఏదో పని చేసుకుంటున్న వాళ్ళమ్మ దగ్గరికి వచ్చాడు.

“మమ్మీ సెక్స్ అంటే ఏమిటి?” అడిగాడు.
అకస్మాత్తుగా ఊహించని ప్రశ్న ఎదురయ్యేసరికి ఆమె కొద్దిగా కంగారు పడింది.
తర్వాత కొంచెం తేరుకుని స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, శుక్రకణాలు, అండాలు, ఫలదీకరణం మొదలైన వాటిగురించి సాధ్యమైనంతవరకు శాస్త్రీయ పదజాలాన్ని ఉపయోగించి తన కుమారుడికి అవగాహన కలుగజేయాలని ప్రయత్నించింది.
అంతా ఓపికగా విన్న తర్వాత వాడు ఇలా అన్నాడు.
“మమ్మీ నాకు నువ్వు ఇంత వివరణ ఇచ్చావు కదా? నా అప్లికేషన్ లో నింపడానికి ఇక్కడ ఒక్క బాక్స్ మాత్రమే ఇచ్చారే” అన్నాడు.

అందుకనే సమాధానం సందర్భోచితంగా ఉండాలి. ఈ జోకుని ఏదో యండమూరి వీరేంద్రనాథ్ నవలలో చదివినట్లు గుర్తు.

ప్రకటనలు

3 thoughts on “సమాధానం సూటిగా, సందర్భోచితంగా ఉండాలి

వ్యాఖ్యలను మూసివేసారు.