ఓ చల్లని సాయంకాలం.
“తమ్ముడూ! నీ మేనకోడలు బాగా అల్లరి చేస్తుందిరా! కాస్త మేడమీదకు తీసుకెళ్ళి ఆడించరాదూ!” అక్క అభ్యర్థన.
సంవత్సరం వయసున్న మేనకోడల్ని భుజానికెత్తుకొని మేడ పైకి ఎక్కాను. వెల్లకిలా పడుకుని పైన కూర్చోబెట్టుకున్నాను. దాని చిరునవ్వులు చూస్తూ ప్రపంచాన్ని మరిచి పోతున్న అనుభూతి.
అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమైంది. వర్షం వచ్చేటట్లుంది. పైకి లేచి పాపనెత్తుకుని చుట్టూ పరికించాను.
ఆశ్చర్యం!
పరిసరాలన్నీ ఏమయ్యాయి? ఎటు చూసినా నీళ్ళే కనిపిస్తున్నాయేమిటి? కనుచూపు మేరలో నీళ్ళు, పొగమంచు తప్ప మరేమీ కనిపించడం లేదు. నిటారుగా నిలబడి ఉన్న పర్వతాలు మొత్తం మంచుతో కప్పబడి పోయాయి. నెమ్మదిగా నీటి మట్టం పెరుగుతోంది, మేము నిల్చున్న భవంతిని కూడా తన గర్భంలో దాచుకోవడానికి…
నాలో ఉన్న తాత్వికుడు “ఏదీ శాశ్వతం కాదు నాయనా!” అని శాంతంగా భోదిస్తున్నాడు. మరో వైపు భవబంధాలను తెంచుకోలేని నాలోని లౌకికుడు అన్ని వైపుల నుంచీ చుట్టుకు వస్తున్న ప్రళయం నుంచి తన్ను , తన కుటుంబాన్ని కాపాడుకోవడం ఎట్లా? అని ఆలోచిస్తున్నాడు. క్రమంగా నీటి మట్టం పెరిగి అంతటినీ ముంచి వేసింది. అంతే….
దిగ్గున లేచాను…చుట్టూ చూస్తే గుర్రు పెడుతూ నిద్రపోతున్న నా స్నేహితుడు తప్ప ఇంకెవరూ కనిపించలేదు…
hi ravi
h r u?
very nice
collegedays lone anukunedanni
nuvu chala great ani
but appudu neneu evvaritho matladedani
kadu appudu college life anta miss ayyanu ani
ippudu feel avuthunta.but,ma office lo kocham enjoy chesanu taruvatha mamule ippudu
endukante now i am married.