ఈ తెలుగు సమావేశం జులై 12

నిన్న ( అంటే జులై 12, 2009 ఆదివారం) నేను హైదరాబాదులో జరిగే ఈ-తెలుగు సమావేశాలకు మొదటి సారిగా హాజరైనాను. యూసుఫ్ గూడ బస్తీలోని కృష్ణకాంత్ ఉద్యానవనంలో జరిగింది. తెలుగు వికీపీడియాలో నాతోపాటూ సహ నిర్వాహకులైన కాజా సుధాకర్ బాబు గారు దీన్ని గురించి తెలియబరచారు. భావ సారూప్యత గల దుర్వాసుల పద్మనాభం గారినీ, సుధాకర్ బాబు గారినీ, వీవెన్ గారినీ, శిరీష్ కుమార్ గారినీ, కత్తి మహేష్ కుమార్ గారినీ, శ్రీనివాస రాజు గారినీ కలుసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది.

మొట్టమొదటి సారిగా కృష్ణకాంత్ పార్కుకు వెళ్ళడం మూలాన గూగుల్ మ్యాప్స్ లో డైరెక్షన్స్ చూసుకుని మరీ వెళ్ళాను. తెలుగు వికీపీడీయా గురించి, అంతర్జాలంలో తెలుగు అభివృద్ధి గురించి మంచి చర్చ జరిగింది. తెలుగు వికీలో గ్రామాల ప్రాజెక్టు, OCR (ఆప్టికల్ క్యారక్టర్ రికగ్నిషన్) సాఫ్ట్‌వేర్, మీడియా వికీ, మోజిల్లా ఫైర్‌ఫాక్స్ లాంటి సాఫ్ట్‌వేర్ల స్థానికీకరణ మొదలైనవి ఈ చర్చలో ముఖ్యాంశాలు.

సుధాకర్  గారు ఒమన్ నుంచి తెచ్చిన ఖర్జూరపు పండ్లు ప్రత్యేక ఆకర్షణ. ధన్యవాదాలు 🙂

ప్రకటనలు