నా గురించి

నా ఫోటో

నా పేరు ఇనగంటి రవిచంద్ర.  మా ఊరు శ్రీకాళహస్తి.  కంప్యూటర్లలో తెలుగు అంటే చాలా ఆసక్తి. అదే నన్ను మొదటగా తెలుగు వికీపీడియాలో పాల్గొనేలా ప్రోత్సహించింది. అక్కడ నేను నిర్వాహకుణ్ణి కూడా. అక్కడ నా పేజీ ఇది.  వీలుంటే మీరు కూడా ఈ మహాయజ్ఞంలో  పాలుపంచుకోండి.

ఇంకా కంప్యూటర్లలో తెలుగు అభివృద్ధి చెందాలంటే ఏమేం చేయాలో ఆలోచిస్తుంటాను. తెలుగులో సాఫ్ట్‌వేర్లు, వెబ్‌సైట్లు తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను. మీకు ఏదైనా ఆలోచనలుంటే నాతో పంచుకోండి. అంతర్జాలంలో తెలుగు కోసం ఇంకా నేను చేసే పనులు.

 1. వర్డ్‌ప్రెస్.కామ్ అనువాదాలు చేస్తుంటాను. ఇక్కడ నొక్కండి.
 2. వికీమీడియా అనువాదాలు చేస్తాను. ఇక్కడ చూడండి.
 3. లాంచ్‌పాడ్ అనువాదాలు చేస్తాను. ఇక్కడ.

67 thoughts on “నా గురించి

 1. రవిచంద్ర గారూ
  ఇంగ్లీషులో ఉన్నట్టు తెలుగులో కూడా spell check సౌకర్యము ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అప్పుడు మామూలుగా తెలుగు రాయడం సరిగా (తప్పుల్లేకుండా) రాయడం కష్టమనుకునే వాళ్ళు కూడా రాయచ్చు. వీలవుతుందేమో ఆలోచించండి.

  • ఇటువంటి సాఫ్ట్‌వేర్ తయారు చేయాలంటే సంపూర్ణ తెలుగు నిఘంటువు అవసరం. అదీ కంప్యూటర్ ఫైల్స్ రూపంలో. నా దగ్గర కొన్ని ఉన్నాయి కానీ కొద్దిగా సమయం పడుతుంది.
   అంతే కాదు ఆంగ్లం కంటే తెలుగుకి మరింత సంక్లిష్టంగా ఉంది. కానీ కొన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి.

 2. IIIT లో కంప్యూటర్ ద్వారా సంస్కృతం రాయడం, బోధించడం లాంటి వాటిపై పరిశోధన జరుగుతున్నట్టు విన్నాను. అలాంటిదే తెలుగులో కూడా జరిగితే బహుష: ఇది సంభవమవచ్చేమో

  • రవి, నీ తీపి గుర్తులను మాతో పంచుకుంటూ మాకు కూడా మధుర స్మృతులను గుర్తు చేసినందుకు చాలా సంతోషం.

   • నిజం గా ఎన్ని మధురస్మృతులు. చాలా సంతోషం వేసింది చదివాక. నీతో పాటు మా అందరినీ మళ్ళీ వెనక్కి తీసుకు వెళ్లినందుకు ధన్యవాదాలు.

 3. రవీ ! మీ ప్రయత్నం అభినందనీయం.బ్లాగు ద్వారా మీ ప్రయత్నం కొనసాగించినా, అందరినీ చేరి బ్లాగులపై వుత్సాహం కలిగించాలంటె , దిన,వార పత్రికల ద్వారానే మీ సాంకేతిక అందించేమ్దుకు ప్రొసీడ్ అవ్వండి. ఎలాగో పత్రికల్లో మీరో పేజి స్రుష్టించుకున్నారు కదా? అభినందనలతో …శ్రెయోభిలాషి …నూతక్కి

  • థాంక్యూ సింధు గారు, తెలుగులో రాయడానికి లేఖిని ప్రయత్నించండి. మీకు కంప్యూటర్లో తెలుగు గురించి కానీ, బ్లాగు గురించి కానీ ఇంకా ఏదైనా సందేహాలున్నా అడగండి.
   నా బ్లాగు సాధ్యమైనంత వరకు క్రమం తప్పకుండా అప్‌డేట్ చేస్తునే ఉన్నాను.

 4. ravichandra garu namaste. nenu mulkanoor major gramapanchayati sarpanchnu nenu maa gramam gurinchina samachaaranni weblo pettalanukuntunnanu. daani dwara vivida deshaalalo unna maa
  oori vaariki net dwara maa gramam gurinchina visheshalu eppatikappudu telipinatlavutundi kaavuna
  meeru vivarinchagalarani manavi.

 5. { వర్డుప్రెస్ లో లింకులని ఎక్కువగా పెడ్తే స్పామ్ లోకి వెళ్తున్నట్లుంది.
  అయినా ఉపయోగపడే లింకులు కనుక మరోసారి ప్రయత్నిస్తాను . }

  గౌతమ్ గారూ మీ ఆలోచన బాగుంది. మీకు సహాయపడగల కొన్ని లింకులు:
  techsetu.com
  nerpu.com

  groups.google.com/group/telugublog/

  telugututorials.blogspot.com

  superblogtutorials.blogspot.com
  mahigrafix.com/forums/

 6. Hello,
  Hello Mr.Ravi, I’m planning to start a group of bloggers to publish e-books/e-magazine. This includes different Articles, Short stories and Photography. Your blog is very nice and I wish you could join our team. It is a non-profit project only to publish our works and no more than that. If you are interested, contact me and I’ll pass on further information regarding this matter. clubrfz@gmail(.)com

 7. గౌరవనియులైన రవి గారికి నా నమస్కారం, మీకు కాలి సమయం దొరికినప్పుడు నాకు మెయిల్ చేస్తారని ఆశిస్తునాను
  ఇట్లు
  సతీష్
  గుర్తు పడతారని ఆశిస్తునాను
  abhivideo@gmail.com

  • బ్రహ్మాజీ గారూ, నా బ్లాగు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆలస్యంగా సమాధానమిస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు, నా దగ్గర అతని ఫోన్ నంబర్, ఏ మెయిల్ కానీ లేదు. కాబట్టి ఫేస్ బుక్ ద్వారా మీ ఫోన్ నంబర్ పంపించాను. అది అతను చూస్తే మీకు ఫోన్ చేయగలడు.

 8. శ్రీ రవిచంద్రగారికి, నమస్కారములు.

  మీరు చేస్తున్న కృషి బహుదా అభినందనీయం. `తెవీకి’ ద్వారా మీరు సుపరిచుతులే.
  ఒక సందేహం:- కొంత కాలం క్రిందట వర్డ్ ప్రెస్.కామ్ లో `తెలుగులో’ వ్రాయబడుతున్న బ్లాగులని చూడాలంటే, languages అనే టాబ్ పై నొక్కితే, అక్కడ English alphabets table కనిపించేవి; వాటిలో `T’ మీద నొక్కితే, Tamil, Telugu మొదలైనవి కనిపించేవి. అప్పుడు telugu మీద నొక్కితే, తెలుగులో వ్రాయబడుతున్న wordpress.com blogs అన్నీ కనిపించేవి. ఇప్పుడు అలా కనపడుటలేదు. ఎందుకని? నేను wordpress.com లో మాత్రమే వ్రాయబడుతున్న తెలుగు బ్లాగ్స్ ని చూడాలంటే ఇప్పుడు ఏమీ చేయాలో చెబుతారా?

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  e-mail:- madhavarao.pabbaraju@gmail.com

  • మాధవ రావు గారూ, వర్డ్‌ప్రెస్.కామ్ వాళ్ళు ఆ సదుపాయాన్ని ఇప్పుడు తీసేసినట్టున్నాడు. ఇంకెక్కడికైనా మార్చాడేమో చూడాలి. కనిపిస్తే మీకు మెయిల్ పంపుతాను.

 9. మీ జాలగతం (blog) చూసి చాల సంతోషం కలిగింది. తెలుగుని మరింత వాడుకలోకి తేవాలన్న ఆదర్శానికి మీ వంటి వారి కృషి చాల మూలం, అభినందనీయం.

  సులువుగా – పుస్తకాల కన్న భిన్నమైన రీతిలో గురుండేటట్లు తెలుగు బోధించాలనే సంకల్పంతో మొదలుపెట్టిన ఒక చిఱు ప్రయత్నం:

  http://www.fb.com/TeluguTelusuko

  దయచేసి – ఇప్పటి వరకు వ్రాసిన ‘కారణాలు, ఉద్దేశ్యాలు” ఇంకా వ్యాసాలు చదివి,

  మీ మిత్రులతో పంచుకోండి. ఈ విషయం లో కూడా భావ వ్యాప్తికి తోడ్పడండి.

 10. Hi Ravi,

  Nice to see your blog.

  Hope you are good.

  I have visited the Dakshina Kalikadevi Temple in srikalahasthi 2008.

  I need small favour in getting the telugu font suitable software for webpage viewing for the following books.

  http://www.kamakoti.org/telugu/1/index.html
  as the old fonts are not working for the latest browser changes after IE8 and window compatible.

  please guide incase you have any info.

  Thanks,
  Nataraju

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s